యూత్ స్టార్ నితిన్( Nithiin ) వరుసగా ప్రాజెక్టులను ప్రకటిస్తూ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.ఎన్ని ప్లాప్స్ వస్తున్నప్పటికీ ఈయన లైనప్ మాత్రం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో సెట్ అవ్వడం విశేషం.
ప్రజెంట్ ఈయన చేస్తున్న ప్రాజెక్టుల్లో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్‘ అనే సినిమా ఒకటి.ఈ సినిమాను వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తుండగా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి అవుతుంది.
వక్కంతం వంశీ రైటర్ గా డైరెక్టర్ గా ఈ సినిమాకు వ్యవహరిస్తున్నారు.మాచర్ల నియోజకవర్గం తర్వాత నితిన్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు అందరిలో ఆసక్తి పెరిగింది.
శ్రేష్ట్ మూవీస్ ఎల్ ఎల్ పి మరియు రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం అయ్యింది.మరి ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది లోనే డిసెంబర్ 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవలే అఫిషియల్ గా ప్రకటించారు.
దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసారు.

నితిన్ ఈ సినిమాలో బాహుబలి 2 లోని దండాలయ్య సాంగ్ లో జూనియర్ ఆర్టిస్టుగా కనిపించడం ఆసక్తిగా ఉంది.భారీ యాక్షన్ తో పాటు లవ్ ట్రాక్, కామెడీ కూడా ఈ టీజర్ లో చూపించారు.దీంతో ఈ టీజర్ హైలెట్ గా నిలిచింది.నితిన్, శ్రీలీల జోడీ మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంది.నితిన్ లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది.మరి ఈ సినిమా ఎలాంటి హిట్ గా నిలుస్తుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటించగా హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.నితిన్, శ్రీలీల జోడీ టీజర్ తోనే ఆకట్టుకోవడంతో సినిమాపై యూత్ లో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.మొత్తానికి ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.







