బీజేపీ రాష్ట్ర అభ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామం యాత్ర పేరుతో ప్రజలకు తప్పుదోవ పట్టడానికి ఈ యాత్రను చేపడుతున్నారాని …ప్రజలు నమ్మరని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు.హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు.
సీఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ యాత్ర చేస్తున్నారన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రనికి చేసింది ఏమిలేదన్నారు.
రైతును రాజు చేయాలని సీఎం కేసీఆర్ విప్లవకారుడు విప్లవాత్మకమైన పథకాలను అమలు చేస్తున్నారన్నారు.రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టు కు కూడా జాతీయ హోదా తీసుకువచ్చారో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేసారు.
నీటి పంపకాల పై ఎటువంటి వివాదం లేకున్నా నీటి రంగాన్ని దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు.ఫుడ్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిన బాధ్యత ఉన్న కావాలని రాదంతం చేస్తున్నారన్నారు.
రైతులు నష్టపోవద్దు అని వడ్లను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే సిగ్గు లేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మెడలు వంచి వడ్లను కొనుగోలు చెపిస్తున్నామని చెప్పుకుంటున్నారన్నారు
.






