తప్పట్లు, తాళాలు, మేళాలు, భావజాలంతో పాటు జై బోలో.గణేష్ మహారాజ్ కీ.
జై.అనే నినాదాలతో హైదరాబాద్ పురవీధులు మారుమోగాయి.చిన్న.పెద్ద.పిల్ల.పాప.ఇలా అందరూ నిమజ్జనోత్సవంలో భాగస్తులు కావడంతో హైదరాబాద్ నగరం మొత్తం కాషాయం అయ్యింది.వినాయక నవరాత్రులు ముగియడంతో హైదరాబాదులోని బాలాపూర్ లో కొలువైన వినాయకుడి లడ్డూ వేలంలో పాడేందుకు ఎంతో పోటీ ఉంటుంది.
ఆ లడ్డూను దక్కించుకుంటే సకల సౌభాగ్యాలు లభిస్తాయన్నది విశ్వాసం.కాగా ఈసారి వేలంలో ఏపీకి చెందిన కడప ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరొకరితో కలిసి లడ్డూను దక్కించుకున్నారు.రికార్డు ధర రూ.18.90 లక్షలు ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు.నవరాత్రులు పూజలు అందుకున్న బాలాపూర్ వినాయకుడికి ఆదివారం ఉదయం 5 గంటలకు గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో మొదటి పూజ చేసారు.అనంతరం శోభాయాత్ర కొనసాగింది.10.45 నిమిషాలకు బాలాపూర్ వినాయకుడు లడ్డూ వేలం గ్రామంలోని బొడ్రాయి వద్ద నిర్వహించారు.లడ్డు వేలంకు దాదాపు 25 మంది వేలం పాటకు పేర్లు నమోదు చేసుకున్నారు.బాలాపూర్ భక్త సమాజం అధ్యక్షుడు కళ్ళం నిరంజన్ రెడ్డి నిర్వాహకులు రూ.1116 లతో వేలం పాట ప్రారంభించారు.

చివరగా నాదర్ గుల్ గ్రామానికి చెందిన మర్రి శాంశక్ రెడ్డి అతను వ్యాపార భాగస్వామి కడప ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ లు సంయుక్తంగా 18.90 లక్షలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు.ఈసారి లడ్డూ ధర గత సంవత్సరం కంటే లక్ష ముప్పై వేలు అధికంగా పలికింది.బాలాపూర్ లడ్డూను వేలం పాటలో సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని ఈ లడ్డూను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి బహుమతిగా అందిస్తామని కడప ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి తెలిపారు.
లడ్డు దక్కితే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని ముందు అనుకున్నామని రెండు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ లతో కలిసి బహుకరిస్తామని పేర్కొన్నారు.