ఆంధ్రలోనే కాదు ఇటు తెలంగాణ.కొన్ని రాష్ట్రా వ్యాప్తంగా కేఎ పాల్ ఫుల్ ఫేమస్.
విచిత్ర రాజకీయాలు చేయాలంటే కేఎ మించిన పర్సన్ నాకు తెలిసి ఇంకో వ్యక్తి లేడు.అయితే ఇప్పుడు మరో మ్యాటర్ తో హల్ చల్ చేస్తున్నాడు.
బీజేపీ తనకు ఉప ప్రధాని పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లో ఇది కీలక చర్చ ఆసక్తికరంగా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల సమస్యలు ఏంటో.వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై చర్చ జరగటం లేదని కేఏ పాల్ అన్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవటంతోనే సమయం గడిపేస్తున్నారని మండిపడ్డారు.అభివృద్ధి కోసం గతంలో తెలంగాణకు మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
కానీ పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయని.ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల పాలైందని అన్నారు.
బీజేపీ తప్పులు ఎత్తిచూపుతున్న మంత్రి కేటీఆర్.టీఆర్‌ఎస్ తప్పులను మాత్రం అంగీకరించటం లేదని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సైతం పరిస్థితి ఇలానే ఉందనీ.తెలుగు రాష్ట్రాల్లో పాలన గాడి తప్పిందన్నారు.
పోటీపడి మరీ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని పాల్ ఆరోపించారు.లక్షల రూపాయలను ఛారిటీల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పంచిపెట్టానని పాల్ పేర్కొన్నారు.
కానీ తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనీ.ఉద్యోగులకు సైతం జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు డబ్బులతో సొంత మీడియాలు పెట్టుకొని, సొంత డబ్బా కొట్టుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.ప్రజలు ఇప్పటికైనా వాస్తవం తెలుసుకొని, ప్రస్తుత అధికార పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేయొద్దని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో గ్రామ గ్రామాన పర్యటిస్తానని పాల్ స్పష్టం చేశారు.రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72, ఆంధ్రప్రదేశ్‌లో 102 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తానని ఆయన తెలిపారు.ఇప్పటి వరకు 18 పార్టీల నాయకులను కలిపేశాననీ, ప్రతి ఒక్కరినీ కలుపుకుంటుూ పోవాలన్నదే తన అభిమతమని పాల్ వివరించారు.
రాబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలైన జగన్, కేసీఆర్ కథ ముగిసినట్లేనని జోస్యం చెప్పారు.తన ప్రతిభ గురించి తెలిసే.
మోదీ, కేసీఆర్, జగన్ సైతం భయపడతారన్నారు.కేఏ పాల్ తమ ప్రత్యర్థి అని కేటీఆర్ ఇప్పటికైనా గుర్తించాలని పాల్ సూచించారు.

గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పాల్ ఘోరంగా ఓడిపోయారు.ఎన్నికల అనంతరం కనీసం రాష్ట్రంలో కాదు కదా, దేశంలోనే లేకుండా వెళ్లిపోయారు.అటువంటిది ఇప్పుడు తెలంగాణలో సైతం పోటీకి దిగుతానని కాలు దువ్వుతున్నారు.ఇటీవలే తెలంగాణ గవర్నర్‌ను కలిసిన ఆయన.ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ త్వరలోనే అరెస్టు కాబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు బీజేపీ ఉప ప్రధాని పదవిని ఆఫర్ చేసిందని చెప్తున్నారు.







