K Vishwanath Vs Veturi : వేటూరికి చుక్కలు చూపించిన విశ్వ‌నాథ్.. చివరికి హిమాలయాలకూ వెళ్లాల్సి వచ్చిందిగా..!

దిగ్గజ దర్శకుడు కె.విశ్వ‌నాథ్ రూపొందించిన “శంక‌రాభ‌ర‌ణం”( Sankarabharanam ) మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది.

 K Vishwanath Working With Veturi-TeluguStop.com

ఈ సినిమా ఒక్క టాలీవుడ్ లోనే కాదు భారతదేశంలోని పలు భాష‌ల్లో డ‌బ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.కొన్ని మూవీ ఇండస్ట్రీలు “శంక‌రాభ‌ర‌ణం” మూవీ స్టోరీ కొనుగోలు చేసి సొంతంగా సినిమాలు చేసుకున్నారు.

కథ బాగుండటంతో అన్నిచోట్ల సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి.ఇక ఇందులోని పాటలు ఎంత విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది.

తెలుగులో పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్( Evergreen Hits ) అయ్యాయని చెప్పుకోవచ్చు.ఈ సినిమా కథ, సంగీతం మాత్రమే కాదు డైలాగులు మిగతావన్నీ కూడా అద్భుతం అని చెప్పుకోవచ్చు.

Telugu Himalayas, Vishwanath, Sankarabharanam-Movie

ఇంత గొప్ప సినిమా తీసే సమయంలో ఒక చిత్రమైన ఘటన జరిగిందట.దీని గురించి పాట‌ల ర‌చ‌యిత వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి ఒకానొక సందర్భంలో తెలిపారు.“శంక‌రాభ‌ర‌ణం” సినిమాకు పాట‌లు రాసే అవకాశం వేటూరి అందుకున్నారు.ఆ అవకాశం చేతికి అందిన సమయంలో వేటూరి( Veturi ) “ఓ సుబ్బారావు.

ఓ అప్పారావు.ఎవ‌రో ఎవ‌రో వ‌స్తారంటే.”, “నువ్వ‌డిగింది ఏనాడైనా కాద‌నన్నానా?” అనే రెండు ఊర మాస్ పాట‌లు రాస్తున్నారు.ఇలాంటి స‌మ‌యంలోనే విశ్వ‌నాథ్‌ కాల్ చేసి శంక‌రాభ‌ర‌ణం సినిమాలోని పాటలకు సాహిత్యం అందించాలని కోరారు.

ఎన్నో పాటలు రాసిన అనుభవం ఉంది కాబట్టి శంక‌రాభ‌ర‌ణం పాటలు రాస్తాను అని వేటూరి వెంటనే ఒప్పుకున్నారు.అడ్వాన్స్‌గా మనీ కూడా తీసుకున్నారు.

Telugu Himalayas, Vishwanath, Sankarabharanam-Movie

ఆ సమయం నుంచి విశ్వ‌నాథ్( Vishwanath ) వేటూరి కి చుక్కలు చూపించారట.ఏ పాట రాసిన దానిని చించి చెత్తబుట్టలో వేసే వారట.వాటిని చించేయకండి, వేరే సినిమాలకైనా ఉపయోగించుకుంటానని ఎంత మొత్తుకున్నా విశ్వ‌నాథ్ అలాగే చించేసేవారట.దాంతో వేటూరి కి దిమ్మతిరిగే ఈ సినిమాకి పాటలు రాయాలంటే ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లాల్సిందే అని అనుకున్నారు.

అలా ఒక యోగి లాగా హిమాలయాల బాట పట్టారు.అక్కడికి వెళ్లిన తర్వాత తన బుర్రలోని చెడు పాటల లిరిక్స్ అన్నీ తీసేసి శంకరాభరణం కోసం చక్కగా పాటలు రాసుకున్నారు.

హిమాలయాలకు( Himalayas ) వెళ్ళాకే వేటూరి ఏకాగ్రత పెరిగిందట.అంత మంచి ఏకాగ్రతతో రాసిన వేటూరి రాసిన పాటలను విశ్వనాథ్ మెచ్చుకొని కళ్ళకు అద్దుకొని తన సినిమాకు వాడుకున్నారు.

ఒక పాట మాత్రం ఒప్పుకోలేదు.చివరికి ఆ పాటను కూడా ఎలాగోలా చక్కగా రాసేసి వేటూరి అందించగలిగారు.

అయితే వేటూరి హిమాలయాలకు వెళ్లడం వల్ల అయిన ఖర్చును నిర్మాత ఏడిద నాగేశ్వ‌ర‌రావు భరించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube