జ్యేష్ఠ అమావాస్య రోజు సూర్యుడికి ఎర్రటి పువ్వులను సమర్పిస్తే..?

ప్రతి మాసంలో అమావాస్య పౌర్ణమి అనేవి సర్వ సాధారణంగా వస్తుంటాయి.ఈ విధంగానే ఈ జూన్ నెల10వ తేదీన జ్యేష్ఠ అమావాస్య వస్తుంది.

ఈ విధంగా ప్రతినెలా వచ్చే అమావాస్యను ఎంతో పవిత్రంగా భావించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ముఖ్యంగా జ్యేష్ఠ అమావాస్య రోజున వట సావిత్రి వ్రతం చేస్తారు.

ఈ అమావాస్య రోజును శని జయంతి అని కూడా పిలువబడుతోంది.అందుకే ఎంతో ప్రత్యేకమైన ఈ అమావాస్య రోజు చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

మరి ఎంతో పవిత్రమైన ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఏ విధంగా పూజ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.జ్యేష్ఠ అమావాస్య రోజున వేకువ జామున నది తీర ప్రాంతంలో స్నానమాచరించడం ఎంతో శుభసూచికం.

Advertisement
Why Red Flowers Are Offered To The Sun On Jyestha Amavasya, Jyeshtha Amavasya,

అయితే నదీ ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబుడు గంగాజలం తీసుకు వచ్చి స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేయాలి.అదే విధంగా ఒక రాగి చెంబులు అక్షతలు ఎర్రటి పువ్వులను వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం అర్పించాలి.

ఈ అమావాస్య రోజు పితృదేవతల కోసం ఉపవాసాలు ఉండి మనకు స్తోమత ఉన్న స్థాయిలో పేదలకు దానధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు సంతోష పడతారు.సాధారణంగా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున వటసావిత్రి వ్రతం ఆచరిస్తారు.

Why Red Flowers Are Offered To The Sun On Jyestha Amavasya, Jyeshtha Amavasya,

ఈ వ్రతమాచరించే వారు తమ భర్త ఆయుష్షు కోసం ఉపవాస దీక్షలతో పూజలు నిర్వహించారు.అదే విధంగా శని అమావాస్య రోజు జన్మించడం వల్ల శని జయంతి అని కూడా చెప్పబడుతూ శని జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే ఈ రోజున శనీశ్వరునికి భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు