ఎన్నిక‌ల వేళ‌.. బాబు చుట్టూ బీసీల గోల‌..!

మ‌రో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు వ‌స్తున్నాయి.తిరిగి అధికారం కైవ‌సం చేసుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర బాబు ద్రుఢంగా నిర్ణ‌యించుకున్నారు.

దీనికిగాను ఆయ‌న అన్ని సామాజిక వ‌ర్గాల‌ను త‌న వైపు తిప్పుకొన్నారు.ముఖ్యంగా బీసీ వ‌ర్గాలే త‌న‌కు ప్రాణ‌మ‌ని, వారివ‌ల్లే త‌న రాజ‌కీయ యాత్ర సాగుతోంద‌ని బాబు ప‌దే ప‌దే చెప్పుకొస్తు న్నారు.

బీసీల‌కు వ‌రాల మీద వ‌రాలుకుమ్మ‌రిస్తున్నారు.నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్ర‌బాబు వ‌ర‌కు టీడీపీలో బీసీల‌కు ఎంతో ప్ర‌యారిటీ ఉంటుంది.

చంద్ర‌బాబు ఓ డిప్యూటీ సీఎం ప‌ద‌విని బీసీ వ‌ర్గాల‌కు చెందిన కేఈ.కృష్ణ‌మూర్తికి కూడా ఇచ్చారు.

Advertisement

మ‌రి ఇంత‌లా బీసీల ప‌ట్ల ప్రేమ కురిపిస్తున్న బాబుకు అదే బీసీ వ‌ర్గం నుంచి సెగ త‌గులుతోంది.బీసీల‌కు వ్య‌తిరేకంగా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటూ.ఫిర్యాదులు వెల్లువె త్తుతున్నాయి.

దీంతో రాష్ట్రంలో ఓ గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది.విష‌యంలోకి వెళ్తే.

సీఎం చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేయ‌డం ఇప్పుడు బీసీ వ‌ర్గాల‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.చంద్రబాబు పాలనలో ఆయన కులానికి చెందిన వారికి మాత్రమే న్యాయం జరుగుతోందని మండిపడ్డారు.

హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో బాబు వ్యవహరించిన తీరు బీసీలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు.ఇక అస‌లు విష‌యంలోకి వెళితే హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఇద్దరు బీసీలు(అమర్‌నాథ్‌గౌడ్, అభినవకుమార్‌ చావల్లి)తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావును సిఫార్సు చేస్తే.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
ఉచిత బస్సు ప్రయాణం ఇప్పట్లో లేనట్టేనా ?

అమర్‌నాథ్‌గౌడ్, అభినవకుమార్, గంగారావు, డీవీ సోమయాజులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ 2017 మార్చి 21న చంద్రబాబు తప్పుడు నివేదిక పంపించారని ఆరోపించారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ తప్పుడు నివేదిక అందజేసి మోకాలడ్డేందుకు యత్నించారని ఆరోపించారు.

Advertisement

అయితే ఇంటెలిజెన్స్‌ బ్యూరో విచారణ చేపట్టి ఆ నలుగురిపై చంద్రబాబు ఇచ్చిన నివేదికలో వాస్తవం లేదని తేల్చడంతో వారు జడ్జీలుగా నియమితులయ్యారని చెప్పారు.తన వద్ద సాక్ష్యాలున్నాయంటూ.

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు చంద్రబాబు లేఖ‌లు రాసిన‌ట్టు చెప్పారు.బీసీలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారని.

కానీ ఆ విలువలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వర్ణాంధ్రప్రదేశ్‌ చంద్రబాబు జాతి కులానికేనా? అని ప్రశ్నించారు.బాబు కులానికి చెందిన వారికి తప్ప ఇతర వర్గాలకు ఎలాంటి ప్రాజెక్టులు గానీ.

పనులు గానీ దక్కడం లేదన్నారు.రాష్ట్రంలో బీసీ మంత్రులున్నప్పటికీ వారికి ఎలాంటి అధికారాలు లేకుండా చేశారన్నారు.

మొత్తంగా ఈశ్వ‌ర‌య్య చేసిన వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.ఒక‌ప‌క్క తాను బీసీల‌కు అనుకూలమనే బాబు ఇంత చేశారా? అనే వారు క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.టీడీపీ అన్నా, చంద్ర‌బాబు అన్నా బీసీల‌తో ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది.

అస‌లు తెలుగుదేశం ఓటు బ్యాంకులో బీసీలే ప‌ట్టుగొమ్మ‌లు.మ‌రి ఇప్పుడు అదే బీసీల విష‌యంలో చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌లు రావ‌డం గ‌మ‌నార్హం.

మ‌రి ఎన్నిక‌ల వేళ త‌లెత్తిన ఈ బీసీల గోల‌కు బాబు ఎలా స‌మాధానం చెబుతారో చూడాలి.

తాజా వార్తలు