తెలంగాణ కాంగ్రెస్( Congress ) లో చేరికలు జోరు అందుకుంటున్నాయి.ఒక్కో కీలక నేత పార్టీలు చేరుతుండడంతో ఆ పార్టీలో ఉత్సాహం కనిపిస్తుంది.
ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో బీఆర్ఎస్, బిజెపి నుంచి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు .ఈ చేరికలతో కాంగ్రెస్ మరింతగా బలపడటం తో పాటు , ప్రజల్లోనూ ఆ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.ఇప్పటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా , అదే సమయంలో పార్టీలో చేరాలని భావించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు( Former Minister Jupalli Krishna Rao ) ఈరోజు కాంగ్రెస్ లో చేరబోతున్నారు.జూపల్లి కృష్ణారావుతో పాటు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి , వనపర్తి పెద్ద మందడి ఎంపీపీ మేఘారెడ్డి, కిచ్చారెడ్డి , ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్వర్ రెడ్డిలు నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు.
వీరి వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ , పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఉన్నారు.

ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjuna Kharge ) సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.వాస్తవంగా గత నెలలో రెండుసార్లు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, ఆ సభలోనే కాంగ్రెస్ లో చేరాలని జూపల్లి తదితరులు భావించినా, భారీ వర్షాలు కారణంగా ఆ సభను ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు.ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడం, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీలోనే ఉండడంతో అక్కడికి వెళ్లి కాంగ్రెస్ ( Congress )పెద్దల సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఇక కాంగ్రెస్ లో వీరికి ఎంతవరకు ప్రాధాన్యం దక్కుతుంది .? ఏ పదవులు సీట్లు విషయమే కాంగ్రెస్ పెద్దల నుంచి హామీ లభించబోతుంది అనేది తెలియాల్సి ఉంది.ఈనెల రెండవ వారంలో తెలంగాణలో కాంగ్రెస్ భారీ సభను నిర్వహించాలనే ప్లాన్ లో ఉంది.ఈ సభలోనూ అంతే భారీగా చేరికలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చేరికల జోరు మరింతగా పెంచి బిఆర్ఎస్, బిజెపిలను ఓడించి అధికారంలోకి రావాలనే పట్టుదలతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా ఉన్నారు.

గ్రూపు రాజకీయాలను సైతం పక్కనపెట్టి ఎన్నికల తంతు ముగిసే వరకు ఐక్యంగా ఉంటూ .పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని పట్టుదల తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది.ఇక ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలు తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అనేక వ్యూహాలు సిద్ధం చేస్తూ పార్టీ నాయకులను అలర్ట్ చేస్తుండడం వంటివన్నీ కలిసి వస్తున్నాయి.







