యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి తరచూ వినిపిస్తూ ఉంటుంది.తారక్ కొన్నేళ్ల క్రితం తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పినా గత కొన్నేళ్లుగా టీడీపీ పొలిటికల్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలకు తారక్ దూరంగానే ఉన్నారు.అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండటానికి తారక్ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీకి తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లభించిన సంగతి తెలిసి్దే.ఈ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్ ను ప్రస్తావించారు.అయితే తన పేరును ట్యాగ్ చేయకపోయినా తారక్ మాత్రం స్పందించి చంద్రబాబుకు థాంక్యూ సో మచ్ మామయ్య అని రిప్లై ఇచ్చారు.
అయితే సీఎం జగన్ కూడా ఆర్ఆర్ఆర్ యూనిట్ ను, తారక్ ను, చరణ్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ కు కూడా తారక్ స్పందిస్తూ థాంక్యూ సార్ అని రిప్లై ఇచ్చారు.చంద్రబాబుకే కాదు జగన్ కు కూడా రిప్లై ఇచ్చిన తారక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.పార్టీలకు అతీతంగా జూనియర్ ఎన్టీఆర్ ముందుకెళుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఎన్టీఆర్ కు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు ఉండగా ఆ గుర్తింపు వల్ల తారక్ క్రేజ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది.ఇతర భాషల ప్రేక్షకులు సైతం తారక్ గొప్పగా యాక్ట్ చేస్తారని ప్రశంసిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఏ మాత్రం తగ్గడం లేదు.తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత మరో సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా కూడా తారక్ కెరీర్ లో స్పెషల్ సినిమాగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.