ఆ ఏరియాలో మహేష్, ప్రభాస్ కంటే ఎన్టీఆర్ తోపు.. దేవర రైట్స్ తో టాప్ లో నిలిచాడుగా!

టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉన్నా కొన్ని ఏరియాలలో కొంతమంది హీరోలకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది.

అలా సీడెడ్ ఏరియాలలో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు ఎన్టీఆర్( NTR ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.

సీడెడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తారక్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

మహేష్ గుంటూరు కారం( Guntur Kaaram ) మూవీ సీడెడ్ హక్కులు 15 కోట్ల రూపాయలకు అమ్ముడవగా సలార్ మూవీ( Salaar ) సీడెడ్ హక్కులు మాత్రం 24 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.అయితే తారక్ దేవర సినిమా( Devara ) సీడెడ్ హక్కులు మాత్రం ఏకంగా 25 కోట్ల రూపాయలకు అమ్ముడవడం కొసమెరుపు.

దేవర సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయో చెప్పడానికి ఇదే సాక్ష్యమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

దేవర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫియర్ సాంగ్ కు ( Fear Song ) ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.దేవర సినిమా రిలీజ్ కు మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ ను ఇప్పటించే మొదలుపెట్టాల్సిన అవసరం అయితే ఉంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న తారక్ ఇకపై కెరీర్ పరంగా గ్యాప్ వచ్చే ఛాన్స్ లేదని ఫ్యాన్స్ కు హామీ ఇస్తున్నారు.

ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా రిలీజయ్యేలా తారక్ కెరీర్ ప్లాన్స్ ఉండగా తారక్ ప్లాన్ చేసుకున్న విధంగా సినిమాలు విడుదలవుతాయేమో చూడాల్సి ఉంది.తారక్ పారితోషికం భారీ స్థాయిలో ఉండగా వరుస సినిమాలు తారక్ కు కెరీర్ పరంగా ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ దేవర రైట్స్ తో టాప్ లో నిలిచాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు