టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ నేడు తాత సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎమోషనల్ అయ్యారు.జూనియర్ ఎన్టీఆర్ కు తాత అంటే ఎంతో ప్రేమ, అభిమానం అనే సంగతి తెలిసిందే.
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఎన్టీఆర్ తన సినిమాలలో సైతం పలు సందర్భాల్లో తాత పేరును ప్రస్తావిస్తూ ఉంటారు.వరుస విజయాలు అందుకుంటున్న తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
మా గుండెలను మరొక్కసారి తాకిపోండి తాతా అంటూ తారక్ ఎమోషనల్ అయ్యారు.సీనియర్ ఎన్టీఆర్ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నపోతుందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.సీనియర్ ఎన్టీఆర్ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.పెద్ద మనస్సుతో తాత మరొక్కసారి ఈ ధరిత్రిని తాకిపోవాలని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
తాను సదా తాత ప్రేమకు బానిసనని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.
ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా జూనియర్ ఎన్టీఆర్ తాతపై ప్రేమను చాటుకున్న విధానాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
తాతకు తగ్గ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.మరోవైపు నందమూరి బాలకృష్ణ మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారని వారి ప్రస్తావన ప్రపంచాన్ని ప్రకంపింపజేస్తుందని పేర్కొన్నారు.అరుదైన కోవకు చెందిన మహానుభావుడు తారకరాముడని బాలకృష్ణ వెల్లడించారు.
సీనియర్ ఎన్టీఆర్ తరాలు మారుతున్నా తరగని కీర్తిని ఆర్జించారని.
గల్లీలో పాలు పోసి ఢిల్లీకి దడ పుట్టించారని.తోటరాముడిగా మొదలై కోట రాముడిగా ఎదిగారని.
కలలో సాధ్యమయ్యే పనులను ఇలలో చేసి చూపించడం తారకరాముడికి మాత్రమే సాధ్యమైందని బాలకృష్ణ తెలిపారు.గ్రీకు శిల్పం లాంటి రూపంతో పురాణ పాత్రల్లో జీవించారని సీనియర్ ఎన్టీఆర్ విజయగాథలు వేరే లోకంలోకి వెంట తీసుకెళ్తాయని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.