హత్య కేసులు, రేప్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా చాలా కామన్ అయ్యాయి.అలాంటి కేసుల గురించి మాట్లాడుకోవడమే జనాలు మానేశారు.
ఎందుకంటే ప్రతిరోజు అలాంటి కొన్ని వందల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి, కోర్టుల్లో శిక్షలు పడుతున్నాయి.కాని ఆస్ట్రేలియాలో ఒక వింత కేసు ఒకటి నమోదు అయ్యింది.
అది కోర్టు వరకు వెళ్లడం, కోర్టులో వాదనలు వినిపించిన సమయంలో బయటకు రావడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.ఇలాంటి కేసులు కూడా నమోదు అవుతాయా, దీనికి 9 కోట్ల నష్టపరిహారం చెల్లించాలా అంటూ కొందరు అవాక్కవుతున్నారు.

కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఆస్ట్రేలియాకు చెందిన ఒక నిర్మాణరంగ సంస్థలో హింగ్ట్స్ అనే ఉద్యోగి పని చేస్తున్నాడు.ఆయన క్యాబిల్‌లో సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్న సమయంలో బాస్ ఏదో పనిపై వచ్చినట్లుగా వచ్చి వెనుకలా పిత్తేవాడు.అలా రోజుకు ఎనిమిది నుండి పది సార్లు క్యాబిన్‌కు వచ్చి పిత్తేవాడని, చుట్టు క్లోజ్డ్‌గా ఉండే తన క్యాబిల్‌లో ఆయన వదిలిన గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది పడేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.అతడు కావాలని వచ్చి తనను ఇబ్బంది పెట్టేందుకు పిత్తేవాడని, అతడి పద్దతి నచ్చక తాను జాబ్ వదిలేశాను అన్నాడు.
నేను జాబ్ మానేయాలనే ఉద్దేశ్యంతోనే నా వెనుకాల వచ్చి అలా పిత్తేవాడని, అతడికి నాపై కోపం ఉందని కోర్టులో వేసిన పిటీషన్‌లో పేర్కొన్నాడు.అతడు పెట్టిన హింస వల్ల జాబ్ మానేసిన కనుక తనకు 1.8 మిలియన్‌ల డాలర్ల నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరాడు.

ఇండియన్ రూపాయల ప్రకారం దాదాపు 9 కోట్ల రూపాయల నష్టపరిహారంను అతడు డిమాండ్ చేస్తున్నాడు.అయితే ఈ కేసును కోర్టు చాలా తేలికగా తీసుకుంది.ఆ బాస్‌ను పిలిచి విచారించిన కోర్టు అతడు కావాలని చేసింది కాదని, ఒకవేళ అలా చేసినా సరదాగా చేసి ఉంటాడని వ్యాఖ్యలు చేసింది.
బాస్ తన వాదనలు వినిపిస్తు తనకు ఆ సమస్య ఉన్న మాట వాస్తవమే అని, అయితే తాను అతడి క్యాబిన్‌కు రోజులో రెండు మూడు సార్లు మాత్రమే వెళ్లేవాడిని అని, ఆ సమయంలో కాకతాళీయంగా జరిగిందేమో అంటూ చెప్పుకొచ్చాడు.మొత్తానికి ఈ కేసు వేయడం వెనుక మరేదైనా ఉద్దేశ్యం ఉందా అంటూ హింగ్ట్స్‌ను కోర్టు ప్రశ్నించింది.







