చిరంజీవికి గాలం వేసిన లారెన్స్! కాంచన 3 ట్రైలర్ రిలీజ్ లో ఆసక్తికర వాఖ్యలు

డాన్స్ మాస్టర్ గా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని తర్వాత నటుడుగా, దర్శకుడు గా సౌత్ ఇండియాలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి లారెన్స్.మెగాస్టార్ సినిమాలతో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు.

 Lawrence Sensational Comments On Chiranjeevi-TeluguStop.com

అలాగే దర్శకుడుగా స్టైల్ సినిమాతో సత్తా చాటి, ఆ తరువాత హర్రర్ కామెడీ జోనర్ లో ముని సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టాడు.దాంతో ఆ హర్రర్ కామెడీకి వరుస సీక్వెల్స్ ని తెరకెక్కిస్తూ ఉన్నాడు.

తాజాగా కాంచన 3 గా నాలుగో సీక్వెల్ ని తెరకెక్కించాడు.

ఇక ఈ సినిమా టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.లారెన్స్ తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాని కూడా మాస్ హర్రర్ ఎలిమెంట్స్ తో ఆవిష్కరించారు.ఇక ఈ సినిమాలో వయసుమళ్ళిన హీరో పాత్రలో లారెన్స్ ఆకట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ రిలీజ్ వేడుకలో లారెన్స్ చేసిన వాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.తనకి ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చిన చిరంజీవితో సినిమా తెరకెక్కించడం తన డ్రీం అని అన్నాడు.

అలాగే కాంచన సిరిస్ లో పది సీక్వెల్స్ వరకు తీసుకొస్తా అని చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube