ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది.ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది.
ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది.కాగా నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు లిఖిత పూర్వక వాదనలు వినిపించారు.
అయితే మనీలాండరింగ్ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వద్దొని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రస్తుతం ఈ కేసులోని ఐదుగురు నిందితులు విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ తీహార్ జైలులో ఉండగా.ఇప్పటికే నిందితులపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.







