తాత పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా.. అలా చేస్తే మాత్రం షాకే అంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మన అందరికి తెలిసిందే.

నందమూరి తారక రామారావు మనవడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటుతో ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్.

ప్రస్తుతం ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తూనే మరోవైపు వార్ 2( War 2 ) సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Jr Ntr In 75 Years Old Man Role, Jr Ntr, Old Man, Old Man Role, Tollywood , Du

కాగా తారక్ తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో చేయనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ ఏడాదే డ్రాగన్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముందట.

Advertisement
Jr Ntr In 75 Years Old Man Role, Jr Ntr, Old Man, Old Man Role, Tollywood , Du

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట.

అందులో ఒకటి యంగ్ డాన్ రోల్ కాగా మరొకటి 75 ఏళ్ళ ఓల్డ్ డాన్ రోల్ అట.ఈ రెండు పాత్రల మధ్య తాతమనవడి రిలేషన్ ఉంటుందని తెలుస్తోంది.

Jr Ntr In 75 Years Old Man Role, Jr Ntr, Old Man, Old Man Role, Tollywood , Du

ఓల్డ్ డాన్ రోల్ సినిమాలో కనిపించేది కాసేపే అయినప్పటికీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది.ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా మేకోవర్ కానున్నాడని సమాచారం.కాగా ఇప్పటికే ఎన్టీఆర్ కొన్ని సినిమాలలో ద్విపాత్రభినయం చేసిన విషయం తెలిసిందే.

తండ్రీ కొడుకులుగా, అన్నదమ్ములుగా నటించి మెప్పించాడు.అయితే ఇలా తాతమనవడిగా నటించడం మాత్రం ఇదే మొదటిసారి.

మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?
Advertisement

తాజా వార్తలు