మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు.ఈయన మొదటి నుండి అందరి కంటే డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధించాడు.
ఈయన సామజిక అంశాలను ప్రధానంగా తీసుకుని దానికి కమర్షియల్ హంగుల్ని జోడించి తెరకెక్కిస్తూ ఉంటాడు.ఈయన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఒక సామాజిక అంశాన్ని తెరమీదకు తెస్తూ ఉంటాడు.
అయితే మెగా హీరోలతో చేసిన సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది.చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాసు అని అంతా అనుకున్నారు.
కానీ ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
అయిపొయింది.ఈ విషయాన్నీ పక్కన పెట్టి కొరటాల నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది.

కొరటాల ఆచార్య తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడని అందరికి తెలుసు.ఈ సినిమాను ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారని టాక్.అయితే కొరటాల శివ ఈ స్క్రిప్ట్ ని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాడట.ఈ స్క్రిప్ట్ పై కొరటాల వర్క్ చేస్తున్నాడని.ఈ కథను ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాడని సమాచారం.ఆచార్య సినిమా ప్లాప్ తో కొరటాల కు ఇప్పుడు డూ ఆర్ డై పరిస్థితి కనిపిస్తుంది.
ఎన్టీఆర్ తో చేసే సినిమ ఖచ్చితంగా హిట్ అయితేనే ఆయన కెరీర్ మరికొంత కాలం సాగుతుంది.లేకపోతే ఈ సినిమా తర్వాత అవకాశాలు రావడం కష్టమే.
అందుకే ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉండేలా చేసుకుంటున్నాడని.ఎన్టీఆర్ ను మరింత ఎనేర్జిటిక్ గా చూపించనున్నాడని టాక్.
చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో.







