డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారీ వారి పాట.ఈ సినిమా ఈ నెల 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ పరశురామ్ మహేష్ బాబుతో జరిగిన గొడవ గురించి స్పందించారు.
గతంలో వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందనే విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురవడంతో ఈ విషయంపై స్పందించి డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒక పెద్ద సినిమా తెరకెక్కుతున్నప్పుడు చిత్ర బృందం మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సర్వసాధారణం.అయితే మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని నేను చెబితే నేను అబద్ధం చెప్పినట్లే.
మహేష్ కి నాకు మధ్య గొడవ అయితే జరిగింది అయితే అది కేవలం చిన్నచిన్న గొడవలు మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఇక కరోనా సమయంలో ఈ సినిమా వాయిదాపడుతూ చిత్రీకరణ జరుపుకోవడం వల్ల ఆ సినిమాని మూడు సంవత్సరాల పాటు మహేష్ బాబు తన మైండ్ లో మోయాల్సి వచ్చింది.
ఇది చాలా కష్టమైన పని ఇలా కొన్ని సార్లు అధిక ఒత్తిడి కారణంగా తను నాపై చిరుకోపం ప్రదర్శించి ఉంటారు ఇవన్నీ సర్వసాధారణం అని ఆయన తెలిపారు.

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న అన్ని రోజులు మహేష్ ప్రతి రోజు నాకు మెసేజ్ చేయడం లేదా ఫోన్ చేసి బ్రదర్ అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని, అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో మా నాన్నకు కరోనా సోకితే నాకు ధైర్యం చెప్పడానికి ఆయన ఒక పది సార్లు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, నా వైఫ్ ఆరోగ్యం బాగా లేకపోతే మహేష్ బాబు స్వయంగా డాక్టర్ తో మాట్లాడారని, మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని డైరెక్టర్ పరశురామ్ వెల్లడించారు.ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు తప్ప పెద్ద గొడవలు లేవని ఈ సందర్భంగా ఆయన క్లారిటీ ఇచ్చారు.








