రామ్ చరణ్ దంపతులకు ఎన్టీఆర్, బన్నీ స్పెషల్ విషెష్.. పోస్ట్స్ వైరల్!

మెగా ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రజలు సైతం రామ్ చరణ్ దంపతులకు( Ram Charan couple ) ఎప్పుడెప్పుడు బిడ్డ పుడుతుందా అని ఎదురు చూసారు.ఎందుకంటే వీరికి పెళ్లి జరిగి 10 ఏళ్ళు అవుతుంది.

 Jr Ntr-allu Arjun Wishes For Charan Couple, Ram Charan, Ntr,allu Arjun, Upasana-TeluguStop.com

మరి ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళకు వీరు గుడ్ న్యూస్ చెప్పడంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో కోలాహలం మాములుగా లేదు.

మరి ఇన్ని ఎదురు చూపుల మధ్య ఈ రోజు ఎట్టకేలకు మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.ఈ రోజు రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులకు పండండి ఆడబిడ్డ జన్మించింది.

ఈ విషయం ఉదయాన్నే బయటకు రావడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి.ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఈ రోజు ఫలితం దక్కినట్టు అయ్యింది.

ఈ క్రమంలోనే సెలెబ్రిటీలు, ప్రముఖులు, మెగా ఫ్యాన్స్ నుండి సోషల్ మీడియాలో వరుసగా విషెష్ అందుతున్నాయి.ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారడంతో అందరికి చాలా సంతోషంగా ఉంది.

మరి తాజాగా ఎన్టీఆర్, అల్లు అర్జున్( NTR , Allu Arjun ) కూడా వారి ఆనందాన్ని పోస్టుల ద్వారా తెలిపారు.ఈ ఇద్దరు చేసిన పోస్టులు ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ పోస్ట్ చేస్తూ.నా స్వీటెస్ట్ గోల్డెన్ హార్ట్ అండ్ మా దయా హృదయురాలు రామ్ చరణ్, ఉపాసనలు తలిదండ్రులు అయినందుకు సంతషంగా ఉందని.నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని చెప్పుకొచ్చాడు.

ఇక తారక్ పోస్ట్ చేస్తూ చరణ్, ఉపాసనలకు పేరెంట్స్ క్లబ్ లోకి ఆహ్వానించారు.మీ చిట్టి పాపాయితో మీకు ప్రతీ క్షణం మధుర ఘపకంగా ఉండాలని కోరుకుంటున్న అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube