ప్రముఖ జర్నలిస్ట్ పై దుండగుల దాడి

ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడినట్లు తెల్సుతుంది.

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి అడ్డగించి మరీ అర్నాబ్ అతని భార్యపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది.

విధులు ముగించుకొని అర్నాబ్ గోస్వామి మరియు అతని భార్య ఇంటికి తిరిగి వెళుతుండగా ఇద్దరు బైక్ ద్వారా వచ్చిన దుండగులు వారి కారుపై దాడి చేశారు.దుండగులు తమ బైక్‌ను అర్నాబ్ గోస్వామి కారు ముందు పార్క్ చేసి, అతన్ని కారును ఆపడానికి మరియు దానిపై దాడి చేశారు.

ముంబైలో తన ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనపై, తన భార్యపై ఏవో రసాయనాలు చల్లినట్లు అర్నాబ్ వెల్లడించారు.

అయితే తమపై దాడి చేసింది కాంగ్రెస్ గుండాలేనని ఆరోపించిన ఆయన.తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా సోనియా గాంధీ, వాద్రా ఫ్యామిలీ బాధ్యత వహించాలి అంటూ ఆయన ఆరోపించారు.కాగా, ఈ ఘటనలో అర్నాబ్, ఆయన భార్య సురక్షితంగా బయటపడగా, పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

దుండగులు, కారుపై దాడి చేసి, కిటికీలు పగలగొట్టడానికి ప్రయత్నించిన తరువాత, కారుపై సిరా కూడా విసిరినట్లు తెలుస్తుంది.రిపబ్లిక్ టివి ప్రకారం, గూండాలు తాము కాంగ్రెస్ వర్గీయులమే అని అంగీకరించినట్లు తెలుస్తుంది.

గోస్వామి నివాసం నుండి 500 మీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని రిపబ్లిక్ టివి తెలిపింది.తనపై దాడి జరిగిన తరువాత అర్నాబ్ గోస్వామి ఒక వీడియోను విడుదల చేసి, మొత్తం సంఘటనను వివరించాడు, కాంగ్రెస్ అధిష్టానం పంపిన గూండాలచే ఎలా తన పై దాడి చేశారో అంటూ ఆ వీడియో లో పేర్కొన్నారు.అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు