ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా జాయిన్ అవ్వండి... ఇంటి వద్దే ఉంటూ రూ.80 వేలు సంపాదించండి!

నేటి యువతకు రైల్వే ఉద్యోగం( Railway job ) అంటే కల.దానికోసం అహర్నిశలు కష్టపడుతూ వుంటారు.

అయితే ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండడం వలన ఏ కొద్దిమందికో జాబ్స్ వస్తుంటాయి.మిగిలినవాళ్లు చాలా నిరాశపడుతూ వుంటారు.

అయితే ఈ వార్త అలాంటివారికోసమే.అవును, మీకు రైల్వే జాబ్ రాకపోయినా ఏం పర్వాలేదు.

ఇపుడు రైల్వేతో కలిసి పనిచేసే అవకాశం పొందండి.ఐఆర్‌సీటీసీ ( IRCTC )(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)తో పని ప్రారంభించడం ద్వారా మీరు ఇపుడు ఇంటివద్ద వుండే సంపాదించుకోవచ్చు.

Advertisement

దీని కోసం మీరు ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌( IRCTC Agent )గా మారవలసి ఉంటుంది.

దీనిని రైల్ ట్రావెల్ సర్వీస్ ఏజెంట్‌గా పరిగణిస్తారు.ఇంట్లో నుంచే కంప్యూటర్‌లో ఈ పని చక్కగా చేసుకోవచ్చు.అలాగే రైల్వేలో టికెట్ గుమాస్తాలు ఏ పని అయితే చేస్తారో? మీరు ఇంటి వద్ద నుంచి అదే పని చేయాలి.మీరు బుక్ చేసిన టికెట్లకు రైల్వే శాఖ కమిషన్ అనేది ఇస్తుంది.

రైల్వే కౌంటర్లలో గుమాస్తాలు టిక్కెట్లు తీసినట్లు, మీరు కూడా ప్రయాణీకులకు టిక్కెట్లు తీయాల్సి ఉంటుంది.ఇక్కడ కాస్త కంప్యూటర్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది.ఇందులో టికెట్ కటింగ్ కోసం ఏజెంట్‌కి కమీషన్ వస్తుంది.

దీని ద్వారా ఏజెంట్లు ఇ-టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)

ఇక కమిషన్ విషయానికొస్తే.నాన్ ఏసీ కోచ్ టిక్కెట్‌ బుక్ చేస్తే ఒక్కో టికెట్‌కు రూ.20, ఏసీ క్లాస్ టికెట్‌ను బుక్ చేస్తే రూ.40 చొప్పున ఏజెంట్‌కు కమీషన్‌గా వస్తుంది.అంతేకాకుండా టికెట్ ధరలో ఒక శాతం ఏజెంట్‌కు ఇస్తారు.

Advertisement

ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా మారడం వల్ల పరిమితి లేకుండా టికెట్లను బుక్ చేసుకొనే వీలుంటుంది.అలాగే 15 నిమిషాల్లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది వీరికి.

ఏజెంట్‌గా మీరు దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్‌లతో పాటు రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.మీరు బుక్ చేసుకున్న టిక్కెట్ల ఆధారంగా మీ సంపాదన ఆధారపడి ఉంటుంది.కాబట్టి, ఒక నెలలో బుక్ చేసుకునే టిక్కెట్ల సంఖ్యను బట్టి ఏజెంట్ నెలకు రూ.80,000 వరకు ఆదాయాన్ని పొందవచ్చు.

తాజా వార్తలు