బిడెన్ కీలక ఆదేశాలు : 1000మంది ప్రత్యేక సిబ్బంది...హడావిడిగా వీసాల జారీ...ఇదంతా ఎవరికోసం..??

అమెరికా ఆఫ్ఘన్ లో తమ సైనిక దళాలను వెనక్కి తీసుకున్న తరువాత, తాలిబన్లు ఆఫ్ఘాన్ ను ఆక్రమించుకోవడం, అలాగే ఆఫ్ఘాన్ అధ్యక్షుడు రాజీనామా చేసి దేశం నుంచీ పారిపోవడం ఇలా అన్నీ పరిణామాలు చెకచెకా జరిగిపోయాయి.

దీనిపై ఎన్ని విమర్శలు వచ్చి పడుతున్నా బిడెన్ మాత్రం తాను చేసింది సరైనదే నని, ఆఫ్హాన్ సైనికుల చేతకాని తనం ఇందుకు కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే అమెరికా బలగాలు అక్కడి నుంచీ వెళ్ళిపోయిన తరువాత అమెరికాకు ఎంతో సాయం చేసిన చాలా మంది ఆఫ్హన్ వాసుల పరిస్థితి ఆందోళనలో పడింది.అయితే ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందమో లేక తమకు సాయం చేసిన కృతజ్ఞత భావమో ఏమో కానీ బిడెన్ తమకు సాయం చేసిన ఆఫ్హాన్ మిత్రులను ప్రత్యేక వలస వీసాల ద్వారా అమెరికా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం కాబూల్ లో అమెరికా రాయబార కార్యాలయంలో అత్యవసరం సేవల వినియోగం లేకపోవడంతో వీసాల జారీకి పరిస్థితులు సహకరించక పోవడంతో తమకు సాయం అందించిన ఆఫ్ఘాన్ వాసులకు వీసాలు కల్పించి అమెరికా పంపే ప్రయత్నాలు చేస్తోంది అమెరికా.వీసాల ప్రక్రియ మొదలయ్యే వరకూ కూడా తమ సైనిక స్థావరాలలోనే వారికి ఆశ్రయం కల్పిస్తోంది అమెరికా మిలటరీ.

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లలో తమకు సాయం చేసిన స్థానికులకు అమెరికా ప్రత్యేక వలస వీసాలు అందించేందుకు సిద్దంగా ఉందని తెలుస్తోంది.అంతేకాదు అమెరికా మరో అడుగు ముందుకు వేసి కొందరు ప్రత్యేక వ్యక్తులకు శాశ్వత వీసాల జారీ చేయాలని కూడా భావిస్తోందట.

Advertisement

ఈ శాశ్వత వీసాకు అర్హులైన వారిలో కొందరు ఆఫ్ఘనిస్థాన్ లో ఉండగా మరికొందరు గల్ఫ్, ఖతర్, కువైట్ లలో ఉన్నారని తెలుస్తోంది.

ఇక వీరందరి కోసం అమెరికా హుటాహుటిన దాదాపు 1000 మంది సిబ్బందితో వీసా జారీ ప్రక్రియను పూర్తి చేయడానికి సిద్దమయ్యిందట.ఇంతకీ అమెరిక గుర్తించిన ఆఫ్ఘాన్ మిత్రులు ఎంతమందో తెలుసా దాదాపు 20 వేల పై చీలుకే.అంతేకాదు మరో 50 వేల మంది ఆఫ్హాన్ మిత్రులు అమెరికా వెళ్లి తలదాచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట.

తాజాగా బిడెన్ తనపై వస్తున్న విమర్సలకు సైతం ఘాటుగానే స్పందించారు.ఆఫ్హాన్ సైనికులకు అన్ని విధాలుగా శిక్షణ ఇచ్చాము కానీ వారు వైఫల్యం చెందారు అందుకు తాము చేసేంది ఏముంటుంది.

ఇకపై ఏ దేశ అంతర్ఘత విషయాలలో తాము తలదూర్చేది లేదు అంటూ తేల్చి చెప్పేశారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు