జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది.ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లుపై జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.
మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.కాగా ఈడీ సమన్లను సీఎం హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
భూ కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఆగస్ట్ 14న ఈడీ సోరెన్ కు నోటీసులు జారీ చేసింది.అయితే బిజీ షెడ్యూల్ నేపథ్యంలో విచారణకు హాజరుకాలేకపోయారు.
తరువాత మరోసారి ఈడీ సమన్లు జారీ చేయగా ఆయన విచారణకు డుమ్మా కొట్టారని తెలుస్తోంది.అనంతరం ఈడీ సమన్లను సుప్రీంలో సవాల్ చేస్తున్నట్లు ఈడీ డైరెక్టర్ కు సోరెన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.







