అరియనాని బ్లాక్ మెయిల్ చేసిన జెస్సీ.. ఇంటర్వ్యూలో మరో కొత్త రూపాన్ని చూపించాడుగా?

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి జెస్సి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

వర్టిగో అనే ఒక సమస్యతో బాధపడుతుండటంతో, బిగ్ బాస్ అతన్ని ఒక సీక్రెట్ రూమ్ లో పెట్టి చికిత్సను అందించింది.

అయినప్పటికీ అదే ఆరోగ్యం కుదుట పడకపోవడంతో బిగ్ బాస్ అతన్ని బయటకు పంపించేసింది.ఇక పదవ వారం కాజల్, మానస్ లలో ఎవరు బయటకు వెళ్తారు అన్న టెన్షన్ కు పుల్ స్టాప్ పెడుతూ నాగార్జున, జెస్సిని బయటకు పంపిస్తున్నట్లు తెలిపారు.

బయటకు వచ్చిన తర్వాత జెస్సి అందరితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడాడు.ఈ క్రమంలోనే సిరి, జెస్సీ నాగార్జున ముందే ఐ లవ్ యు చెప్పుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చేశారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తరువాత జెస్సీని అరియనా స్పెషల్ గా ఇంటర్వ్యూ చేసింది.ఇందులో జెస్సీ ప్రవర్తించిన తీరు ఆడియన్స్ కు కాస్త షాకింగ్ గా అనిపించింది.

Advertisement

షణ్ముఖ్ ను సిరి భరిస్తుంది అంటూ బాంబు పేల్చాడు.సిరిని చూడగానే తనకు క్రష్ ఏర్పడిందని అరియనా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

అసలు ఏ అమ్మాయిని వదలవా అని అరియానా అడగగా, సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు ఎవరైనా కొత్త అమ్మాయిని పంపుతారేమో అని ఎదురు చూశా కానీ బిగ్ బాస్ ఎవరిని పంపలేదని అన్నాడు.రూమ్ లో ఒక్కడినే ఉన్న మనం చాలా చండాలంగా ఉందని అరియానా అనగా, నువ్వు సోహెల్ మాత్రం సీక్రెట్ రూమ్ లో ఉండ లేదా అంటూ ప్రశ్నించగా.అరియాన ఎక్కువ మాట్లాడితే నా సీక్రెట్స్ బయటకు వచ్చేలా ఉన్నాయి అంటూ సిగ్గు పడింది.

ఒక రకంగా జెస్సి సీక్రెట్స్ బయట పెడతానంటూ బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉంది ఆ ఇంటర్వ్యూ.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు