నేచురల్ స్టార్ నాని సినిమా అనగానే అందరిలో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జెర్సీ చిత్రంను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు.
నాని మొదటి సారిగా క్రికెటర్‌గా కనిపించడంతో పాటు, పదేళ్ల బాబుకు తండ్రిగా ఈ చిత్రంలో కనిపించాడు.అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటంతో ఏకంగా నాని కెరీర్‌లోనే మొదటి సారి 50 కోట్ల బిజినెస్ చేసింది.
మరి ఈ చిత్రం ఎలా ఉంది, అంచనాలను అందుకుందా అనేది ఈ రివ్యూలో చర్చిద్దామా.
నటీనటులు : నాని, శ్రద్దా శ్రీనాధ్, సత్యరాజ్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, సంపత్ రాజ్, ప్రవీణ్దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరినిర్మాత : సూర్యదేవర నాగవంశీసంగీతం : అనిరుధ్
కథ : అర్జున్(నాని) బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణతో సినిమా ఆరంభం అవుతుంది.1986లో క్రికెటర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న అర్జున్ అదే సమయంలో సార్హా(శ్రద్దా శ్రీనాధ్) ప్రేమలో పడతారు.ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు.కొన్ని సంవత్సరాల తర్వాత క్రికెట్‌కు దూరం అవ్వడం, ఇద్దరి మద్య విభేదాలు.1996లో మళ్లీ అర్జున్ కోచ్ సత్యరాజ్ సాయంతో క్రికెటర్‌గా ఎంట్రీ ఇస్తాడు.రంజీ మ్యాచ్‌లలో ఆడి ఎలా తన సత్తాను అర్జున్ చాటాడు అనేది సినిమా కథాంశం.ఇది ఒక క్రికెట్ కమ్ లవ్ జర్నీలా సాగింది.మద్యలో నాని ఎందుకు క్రికెట్ ను వదిలేయాల్సి వచ్చింది.సారా, అర్జున్‌ల మద్య వివాదం ఏంటీ అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన : నేచురల్ స్టార్ అనే పేరు ఉన్నందుకు నాని మరోసారి నిరూపించుకున్నాడు.అద్బుతమైన నటనతో తాను కనిపించిన ప్రతి సీన్ స్థాయిని నాని పెంచాడు.ముఖ్యంగా ఎమోషనల్ సీన్, ఇంటర్వెల్ ముందు సీన్‌లో నాని నటన పీక్స్ అని చెప్పాలి.కొడుకుపై తనకు ఉండే ప్రేమను కళ్లలో చూపించడంలో నాని సక్సెస్ అయ్యాడు.
ఇక హీరోయిన్‌గా శ్రధ్దా శ్రీనాద్ కూడా ఆకట్టుకుంది.మొదట రొమాంటిక్ సీన్స్‌తో ఆకట్టుకున్న శ్రద్దా ఆ తర్వాత ఒక బాధ్యత కలిగిన గృహిణిగా మెప్పించింది.
సత్యరాజ్ మరియు సంపత్ లు తమ పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించారు.
టెక్నికల్ : అనిరుధ్ రవిచంద్రన్ అందించిన పాటలు ఒక మోస్తరుగా ఉన్నాయి.రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి.
అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరగొట్టాడు.అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమా స్థాయిని పెంచాడు.
పలు సీన్స్ స్థాయిని రెట్టింపు చేసేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది.సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా వచ్చింది.
ముఖ్యంగా క్రికెట్‌కు సంబంధించిన సీన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అనిపించింది.దర్శకుడు గౌతమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.
నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి.
విశ్లేషణ :
నాని సినిమా అంటే ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తారో, ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్ అదే చూపించాడు.తప్పకుండా ఈ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు గౌతమ్ విభిన్నంగా నానిని ప్రజెంట్ చేశాడు.ఒక తండ్రిగా నానిని చూపించే సమయంలో దర్శకుడు చాలా ఆలోచించి ఉంటాడు.
ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని భావించి ఉంటాడు.అయితే నాని పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగుంది.
ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సీన్‌లు మనసుకు హత్తుకునే విధంగా ఉంది.అద్బుతంగా సాగిన జెర్సీ జర్నీ ప్రతి ఒక్కరికి నచ్చక పోయినా ఎక్కువ శాతం మందికి మాత్రం కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్ :
నాని, కొన్ని ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్, కథ, స్క్రీన్‌ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త తగ్గడం, కొన్ని సీన్స్ ఎడిటింగ్ సరిగా చేయకపోవడం
రేటింగ్ : 2.75/5.0
బోటం లైన్ : నాని ‘జెర్సీ’ ఎక్కువ శాతం మందికి మనసుకు హత్తుకుంటుంది.