మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్న జేసీ..? అంద‌రినీ క‌లుస్తూ...

తెలుగు రాష్ట్రాల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ అంటే తెలియ‌ని వారుండ‌రు.ఇక‌ జేసీ దివాక‌ర్ రెడ్డి స్టైలే వేరు.

 Jc Becoming Active Again Meeting Everyone.. Jc Brothres, Jc Divaker Reddy, Jc Pr-TeluguStop.com

ఏ విష‌య‌మైనా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్తుంటారు.ఇక రాజ‌కీయాల్లో త‌న‌దైన స్టైల్ లో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తుంటారు.కాగా కాంగ్రెస్ నేతగా చాలా కాలం రాజకీయాల్లో కొనసాగిన జేసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత టీడీపీలో చేరారు.2014లో టీడీపీ తరఫున జేసీ దివాకర్రెడ్డి అనంతపురం ఎంపీగా.ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఐదేళ్లపాటు అనంతపురం జిల్లా రాజకీయాలను సోదరులిద్దరూ శాసించారు.ఇక 2019 ఎన్నిక‌ల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరూ పోటీ చేయలేదు.అనంతపురం నుంచి టీడీపీ తరఫున లోక్ స‌భ‌ అభ్యర్థిగా జేసీ దివాక‌ర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి… తాడిపత్రి నుంచి అసెంబ్లీకి జేసీ ప్రభాక‌ర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేశారు.

అయితే వీరు ఇద్దరూ ఓడిపోయారు.

ఓడిపోవ‌డంతో కేసులు.

దీంతో 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌ అన్నీ మారిపోయాయి.వైసీపీ అధికారంలోకి రావడంతో జేసీ బ్రదర్స్ కి కష్టాలు మొదలయ్యాయి.

దివాకర్ ట్రావెల్స్ పైజేసీ బ్ర‌ద‌ర్స్ పై అనేక కేసులు నమోదు చేసి జైలుపాలు చేసింది అధికార పార్టీ వైసీపీ.అంతేకాకుండా ఒక కేసులో బెయిల్ దొరికిందనేలోపే ఇంకో కేసులో అరెస్టు చేయడం చేయ‌డంతో అప్పటి నుంచి జేసీ దివాక‌ర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు.

రాజకీయాల్లోనూ అంత చురుగ్గా పాల్గొన‌లేక‌పోయారు.ఇక దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

సైలెంట్ వీడి.

Telugu Ap Poltics, Asmith Reddy, Jc, Jcpawan, Thadipathri-Political

అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా జేసీ దివాక‌ర్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి యాక్టివ్ గా ఉంటున్నార‌ని చెబుతున్నారు.గ్రామాలవారీగా పర్యటనలు చేయడం.పాత పరిచయస్తులందరినీ కలవడం వారి యోగక్షేమాలు తెలుసుకోవడం చేస్తున్నార‌ట‌.

తాడిపత్రి నియోజకర్గంలో గ్రామగ్రామానికి వెళ్లున్న జేసీ పాత జేసీని పరిచయం చేస్తున్నారని అంటున్నారు.తాడిపత్రి నియోజకవర్గం నుంచి జేసీ దివాక‌ర్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.2014లో ఆయన అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.దీంతో జేసీ ప్రభాక‌ర్ రెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో తాడిపత్రి నియోజకవర్గంలో గడప గడపకూ తిరుగుతున్న ఆయనను చూసి ఆయన అభిమానులు ప్రజలు పెద్దాయన వచ్చాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారట.

గత ఎన్నికల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ పోటీ చేయలేదు.

వీరిద్దరి కుమారులు ఎన్నికల్లో పోటీ చేశారు.వృద్ధాప్యంతో జేసీ దివాక‌ర్ రెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా అప్పట్లో ప్రకటించారు.

అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన మళ్లీ యాక్టివ్ కావడంతో అనంతపురం రాజకీయాలు రంజుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేస్తారా.? లేదంటే గత ఎన్నికల్లో మాదిరిగానే ఆయన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube