జయమ్మ కొత్త ట్రైలర్‌.. సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది

సుమ ప్రథాన పాత్ర లో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ విడుదలకు సిద్దం అయ్యింది.ఈనెల 6వ తారీకున విడుదల కాబోతున్న జయమ్మ పంచాయితీ నుండి మరో ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

 Jayamma Panchayithi Movie Second Trailer Release By Mahesh Babu , Anchor Suma ,-TeluguStop.com

మొదటి ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ తో విడుదల చేయించారు.ఆయన సినిమా విడుదల సందర్బంగా తన శుభాకాంక్షలు తెలియజేశాడు.

మహేష్ బాబు తాజాగా రెండవ ట్రైలర్‌ ను విడుదల చేశాడు.సినిమా రిలీజ్ ట్రైలర్ అంటూ జయమ్మ రెండవ ట్రైలర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

మహేష్‌ బాబు రిలీజ్ చేయడం వల్ల భారీ వ్యూస్ ను ఈ ట్రైలర్‌ దక్కించుకుంది.ఇప్పటికే సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆ అంచనాలు మరింత పెరిగేలా మహేష్ బాబు విడుదల చేసిన జయమ్మ పంచాయితీ రెండవ ట్రైలర్‌ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.జయమ్మ గా సుమ కనబర్చిన నటన అద్బుతంగా ఉందంటూ ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారీ ఎత్తున సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రంలో మరియు అమెరికాలో కూడా సినిమా ను విడుదల చేయబోతున్నారు.

తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా సుమ వారందరికి కూడా సుపరిచితురాలు.అందుకే జయమ్మ పంచాయితీని అక్కడ ఇక్కడ అని కాకుండా స్టార్‌ హీరోల సినిమాలు విడుదల అయ్యే ప్రతి చోట కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

రికార్డు స్థాయిలో ఈ సినిమా కు బిజినెస్ అయ్యింది.కొత్త ట్రైలర్ విడుదల తర్వాత సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ రెట్టింపు అయ్యాయి.ఇంతకు జయమ్మ పెట్టిన ఆ పంచాయితీ ఏంటో అర్థం కాక ప్రతి ఒక్కరు కూడా జుట్టు పీక్కుంటున్నారు.సినిమా సక్సెస్‌ అయితే ఖచ్చితంగా భారీ వసూళ్లు ఈ సినిమా కు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube