నటి జయలలిత( Jayalalitha ) మీకందరికీ గుర్తుండే ఉంటుంది.ప్రస్తుతం ఆమె బుల్లితెరపై బాగా బిజీగా కనిపిస్తున్నారు.
40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న జయలలిత ఎంతో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం ఆమెకు అంటూ ఆస్తులు ఏమీ లేవు పైగా సంపాదించిన డబ్బు కూడా లేదు.
కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది అందులోనే ఆమె జీవిస్తున్నారు.జయలలిత తన జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకుని మోసపోయారు.
ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం కానీ, పిల్లలను కనడం కానీ చేయలేదు.అందుకే ఆమె ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు అయితే ఎవరి దగ్గర సహాయాలు అడగడం వంటివి మాత్రం చేయదు జయలలిత.
ఇక జయలలిత ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా కనిపిస్తుంది సినిమాలు తగ్గించినా ఆమెకు సినిమా ఇండస్ట్రీ నుంచి సహాయ సహకారాలు ఎంతో కొంత అందుతూనే ఉన్నాయి.అయితే బుల్లితెరపై కూడా కొన్ని విపరీతమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు అదేంటంటే ఒక నటి వల్ల తాను ఇబ్బందులు పడ్డానని తాను నాకన్నా వయసులో దాదాపు 30 ఏళ్లు చిన్నదే అయినా కూడా తన పట్ల దురుసుగా ప్రవర్తించింది అని చెబుతున్నారు జయలలిత.
ప్రేమ ఎంత మధురం అనే సీరియల్( Prema Entha Maduram ) లో నటిస్తున్న క్రమంలో ఇటీవల కొత్తగా సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక నటి తనను ఎంతగానో వేధించిందని ఆమె వల్ల ఆ సీరియల్ నుంచి కూడా తప్పుకున్నానని ప్రస్తుతం తనకున్న ఏకైక ఆదాయ మార్గం కూడా ఆమె వల్ల చేయి జారిపోయిందనే చెప్తున్నారు మూడేళ్లుగా ఆ యూనిట్ తో ఎంతో కలిసిపోయి సీరియల్ ( Serial )లో నటించానని కానీ ఎంతో సులువుగా నేను బయటకు వస్తే ఒక్కరూ కూడా అడగలేదని ఇది కేవలం డబ్బు ఇండస్ట్రీ మాత్రమే అని ఇక్కడ మానవ సంబంధాలకు విలువ లేదని తెలిపారు.ఇక పెద్దలు ఎవరైనా దయతల చిత్రం ఆదుకుంటే బాగుంటుందని కూడా ఆవిడ తన కోరికను తెలియజేశారు.నాకు నాగబాబు అప్పుడప్పుడు తనకు కొంత డబ్బు పంపిస్తూ ఆదుకుంటున్నారని కూడా జయలలిత తెలిపారు.