కన్ను మూసి తెరిచేలోగా మాయమైన జపాన్ బుల్లెట్ ట్రైన్.. వీడియో వైరల్..

జపాన్ షింకన్‌సేన్ ట్రైన్ వ్యవస్థ 1964 నుంచి ప్రారంభమైంది.షింకన్‌సేన్ అంటే ఇంగ్లీషులో బుల్లెట్ ట్రైన్ అని అర్థం.

 Japanese Bullet Train That Disappeared In The Blink Of An Eye Video Viral , Bull-TeluguStop.com

ప్రపంచంలోని ప్రస్తుత అత్యంత వేగవంతమైన రైళ్లు జపాన్ దేశంలో నడిచే బుల్లెట్ ట్రైన్స్ అని చెప్పవచ్చు.ఈ బుల్లెట్ ట్రైన్స్ గంటకు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి.

వీటికి సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్‌లో లభిస్తాయి.అయితే తాజాగా ఒక బుల్లెట్ ట్రైన్ మంత్ర సినిమాల్లో ఓ వస్తువు క్షణాల్లో మాయమైనట్లుగా కన్నుమూసి తెరిచేలోగా మాయం అయిపోయింది.

దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో బుల్లెట్ ట్రైన్ వెళ్లే రైలు మార్గంలో ఒక వ్యక్తి కెమెరా పట్టుకొని రికార్డ్ చేయడం గమనించవచ్చు.ఇంతలోనే ఆ రైలు పట్టాలపై నుంచి ఒక బుల్లెట్ ట్రైన్ చాలా వేగంగా దూసుకెళ్లడం చూడవచ్చు.

ఒకే ఒక్క సెకన్‌లో ఆ ట్రైన్ మాయమయింది. @Dailyloud అనే ట్విట్టర్ అకౌంట్ ఈ వీడియోను షేర్ చేసింది.

ఆరు సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటికే పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో, ఏంటి ఇంత వేగంగా వెళుతోంది? ఇలాంటి స్పీడ్‌లో తప్పితే పరిస్థితి ఏంటి అని కామెంట్లు చేస్తున్నారు.ఇది గుద్దితే క్షణాల్లోనే ఎవరైనా సరే దుమ్ములా మారిపోతారని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.దీని ముందు నిల్చుంటే నొప్పి తెలియకుండా క్షణాల్లోనే చచ్చిపోతామని మరో యూజర్ కామెంట్ చేశారు.

జపనీయులు మామూలోళ్ళు కాదు అని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube