జస్టిస్ రాధాభినోద్ పాల్.ఈ పేరు తెలియని భారతీయుడు ఉంటారేమో కానీ ఈ భారతీయుడికి గురించి తెలియని జపనీయుడు ఉండడంటే ఆశ్చర్యం కలుగక మానదు.
ఎందుకంటే జపనీయులు మన భారతీయుడైన ఈ రాధాభినోద్ పాల్ కు గుడి కట్టి మరీ పూజిస్తారు, ఇంట్లో ఫోటోలు పెట్టుకుని మరీ ఆరాధిస్తారు.అంతగా జపాన్ వాసుల గుండె లోలోతులకు ఓ భారతీయుడు చేరుకోవడం, వారి అంతగా ఆయన్ను అభిమానించడానికి కారణం ఏమయ్యి ఉంటుందనే సందేహం ఈ పాటికే అందరికి కలిగి ఉంటుంది.
అవును విపత్కర సమయంలో కష్ట సమయంలో మనకు సాయం చేసిన వాళ్ళను మనం గుండెల్లో పెట్టుకుని ఎలా పూజిస్తామో జపనీయులు కూడా రాధాభినోద్ పాల్ ను అలాగే పూజిస్తున్నారు.వారికి ఆయన చేసిన సాయం ఏంటి…
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
అన్ని దేశాలు జపాన్ ను దోషిగా ప్రపంచ కోర్టు ముందు నుంచోబెట్టాయి.అంతేకాదు ఆసియా , పసిపిక్ దేశాలపై జపాన్ దాడులకు దిగిందని, రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఇటలీ, జర్మనీతో జపాన్ దూకుడుగా వ్యహరించిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఈ సమయంలోనే జపాన్ చేసిన అన్యాయాలకు శిక్షని విధించి తీరాలని మిత్ర పక్ష దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.దాంతో జపాన్ కీలక నేతలు, సైన్యాదికారులతో పాటు, సైనికుల పై కేసులు పెట్టి బోనులో నిలబెట్టారు.ఈ క్రమంలో

జపాన్ తరుపున గొంతు వినిపించిన ఏకైక వ్యక్తి జస్టిస్ రాధాభినోద్ పాల్.జపాన్ పై వచ్చిన కేసులను విచారించడానికి టోక్యో లో ట్రయిల్ బెంచ్ కూడా ఏర్పాటు చేశారు.ఈ బెంచ్ సభ్యులలో రాధాభినోద్ పాల్ కూడా ఒకరు.అందరూ జపాన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే రాధాభినోద్ పాల్.మాత్రం జపాన్ కు మద్దతు ప్రకటించారు.జపాన్ ను యుద్దానికి ఉసిగొల్పిన దేశాలకు కూడా ఈ కేసులో భాగస్వామ్యం ఉంటుందని, వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలి కదా అంటూ తన అభిప్రాయం గట్టిగానే వినిపించారు.
యుద్ద సమయంలో యుద్ధం చేయడం నేరం ఎలా అవుతుందని, ఇందుకోసం శిక్షలు విధించడం సరైన నిర్ణయం కాదని, కేవలం ఒకే ఒక్క వ్యక్తి జపాన్ కు అనుకూలంగా మాట్లాడటంతో జపాన్ వాసులు కదిలిపోయారు.చివరికి ఆయన ఒక్కడి వాదనలు మెజారిటీ జస్టీస్ ల ముందు మూగబోయాయి, మెజారిటీ వారు చెప్పిందే అమలయ్యింది.
కానీ రాధాభినోద్ పాల్.మాత్రం తమవైపు నిలబడిన ఒకే ఒక్క వ్యక్తి అంటూ జపాన్ ఆయన్ని విశిష్ట అవార్డు తో సత్కరించుకుంది.
ఆయనకు గుడులు కట్టి పూజించింది.నేటికి ఆయన ఫోటోలు జపాన్ వాసుల ఇళ్ళలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు…
.