అక్కడ లాక్ డౌన్ కారణంగా ఒక్కొక్కరికి 70,000 ఇస్తున్నారట..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా కలకలం సృష్టిస్తున్నదో పెద్దగా చెప్పనవసరం లేదు.

అయితే ఈ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇప్పటికే పలు దేశాలు ఆర్థిక పరంగా దెబ్బతిన్నాయి.

దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే మరి కొంత కాలం పాటు కొనసాగితే ప్రపంచంలోనే చిన్న చిన్న దేశాలు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడడం ఖాయమని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇలా ఆర్థిక మాంద్యంతో ప్రస్తుతం ఇబ్బందిపడుతున్న దేశాల్లో జపాన్ దేశం ఒకటి.

ప్రస్తుతం జపాన్ దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో ఆ దేశంలో మరింత కాలం పాటు లాక్ డౌన్ పొడగించాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.దీంతో ప్రజలు పూట గడవక ఇబ్బంది పడటమే కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధి కూడా బాగా దెబ్బతింది.

అందువల్ల దేశ ప్రభుత్వ అధికారులు ఆ దేశ ప్రజల కోసం దాదాపుగా వన్ ట్రిలియన్ డాలర్లు ఆర్థిక ప్యాకేజీని ప్రవేశపెట్టారు.అందులో భాగంగా దేశంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి దాదాపుగా 70 వేల రూపాయలు ఒక్కొక్కరికి అందించనున్నట్లూ సమాచారం.

Advertisement

దీంతో ఆ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమని కష్టకాలంలో ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి చొరవను మరువలేమని, రుణపడి ఉంటామని అంటున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదయినటువంటి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటివరకు దాదాపుగా 47,10,614 కేసులు నమోదు కాగా ఇందులో 17,32,344 మంది విజయవంతంగా కోలుకున్నారు.అలాగే  3,15,023 మంది ప్రాణాలు కోల్పోయారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు