ఆ ట్రోల్స్ చూసి చాలా బాధ పడ్డాను.. శ్రీదేవి కూతురు షాకింగ్ కామెంట్స్!

జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే తనపై వచ్చే ట్రోల్స్ గురించి ఒకింత ఘాటుగా స్పందించిన జాన్వీ కపూర్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

 Janhvi Kapoor Shocking Comments Goes Viral In Social Media Details, Janhvi Kapoo-TeluguStop.com

ట్రోల్స్ వల్ల తాను ఎంతో బాధ పడ్డానని ఆమె తెలిపారు.కొందరు నెపో కిడ్ అంటూ చేసిన కామెంట్లు నన్ను ఎంతగానో బాధ పెట్టాయని జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్లు చేశారు.

నెపోకిడ్ అంటూ కొంతమంది చేసిన కామెంట్ల వల్ల తాను చాలా బాధ పడ్డానని జాన్వీ పేర్కొన్నారు.మనం సక్సెస్ సాధించడానికి ఎంతగానో కష్టపడినా కొందరు మాత్రం మనలోని తప్పులను వెతకడానికి ప్రాధాన్యత ఇస్తారని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ విధంగా వాళ్లు ఆనందం పొందుతారని జాన్వీ కపూర్ కామెంట్లు చేశారు.వాళ్ల వ్యాఖ్యల వల్ల మనం న్యూస్ లో నిలుస్తున్నామని ఇది నిరంతం కొనసాగే ప్రక్రియ అని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Bollywood, Janhvi Kapoor, Janhvikapoor, Nepokid, Nepotism, Sridevi, Troll

దురదృష్టం కొద్దీ కొన్నిరోజులు అయిన తర్వాత ఈ వార్తలు చదివి విసిగిపోతారని శ్రీదేవి కూతురు కామెంట్లు చేశారు.కెరీర్ తొలినాళ్ల నుంచి నాపై నెపో కిడ్ అనే విమర్శలు వచ్చాయని ఆమె తెలిపారు.కొంతమంది తాను సినిమాలలో ఎందుకు నటిస్తున్నానని కూడా కామెంట్ చేశారని శ్రీదేవి కూతురు తెలిపారు.కెరీర్ తొలినాళ్లలో ట్రోల్స్ బాధ పెట్టాయని ఇప్పుడు మాత్రం ట్రోల్స్ చూసి నవ్వుకుంటున్నానని ఆమె అన్నారు.

Telugu Bollywood, Janhvi Kapoor, Janhvikapoor, Nepokid, Nepotism, Sridevi, Troll

నా బలాలు, బలహీనతలు నాకు తెలుసని జాన్వీ కపూర్ తెలిపారు.ప్రస్తుతం ట్రోల్స్ ను చూసి నవ్వుకుంటున్నానని ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోకూడదని నాకు అర్థమైందని ఆమె తెలిపారు.గత రెండు సినిమాలు నాకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయని జాన్వీ పేర్కొన్నారు.జాన్వీకి సోషల్ మీడియాలో కూడా క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube