తాడేపల్లికి చేరిన మైలవరం పంచాయతీ

ఎన్టీఆర్ జిల్లా మైలవరం పంచాయతీ మరోసారి సీఎం జగన్ దగ్గరికి చేరనుంది.ఇవాళ సాయంత్రం మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ సీఎం జగన్ ను కలవనున్నారు.

 Mylavaram Panchayat Joined Tadepalli-TeluguStop.com

గత కొంతకాలంగా మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు ఇరువురి మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు ప్రయత్నించారు.

కానీ ఎలాంటి మార్పు కనిపించలేదని తెలుస్తోంది.

మైలవరంలో రెండు వర్గాలుగా విడిపోయిన వైసీపీ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.

తాజాగా రెండు రోజుల కిందట రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ వద్దకు ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి.ఈ విషయంపై సాయంత్రం జగన్ తో ఎమ్మెల్యే సమావేశం కానున్నారని తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలతో దూరంగా ఉంటూ వస్తున్న ఎమ్మెల్యే గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస్ కు మద్ధతుగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube