శ్రీదేవి( Sridevi )తనయురాలు జాన్వి కపూర్ తెలుగులో ఎన్.టి.ఆర్ దేవర( Devara )తో ఎంట్రీ ఇస్తుంది.ఆమె సౌత్ ఎంట్రీ భారీగా ఉండబోతుందని తెలుస్తుంది.
దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ రేంజ్ లో ఉండబోతుంది.తల్లి శ్రీదేవి తరహాలోనే సౌత్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది జాన్వి కపూర్.
అయితే జాన్వి దేవర సినిమా తర్వాత నెక్స్ట్ సినిమాపై మళ్లీ కన్ ఫ్యూజన్ లో ఉందని తెలుస్తుంది.

అఖిల్ నెక్స్ట్ సినిమాలో జాన్వి( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తుంది అన్న వార్తలు రాగా వాటిలో నిజం లేదన్నట్టు తెలుస్తుంది.దేవర చేస్తున్న టైం లోనే జాన్వి కపూర్ వరుస తెలుగు సినిమాలు చేస్తే బెటర్ అని ఆడియన్స్ అంటున్నారు.అయితే దేవర హిట్ పడితే ఎలాగు జాన్వి వెంట దర్శక నిర్మాతలు పడే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది.
జాన్వి కపూర్ రెండో తెలుగు సినిమా ఏదై ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది.జాన్వి కపూర్ మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేయాలని చూస్తుంది.
తప్పకుండా జాన్వికి తెలుగుతో పాటుగా తమిళ పరిశ్రమ నుంచి కూడా ఆఫర్లు రావడం పక్కా అని చెప్పొచ్చు.







