జనసేన ముద్దు టీడీపీ వద్దు ! అదే బీజేపీ రాజకీయం 

పొత్తుల విషయంలో బిజెపి ( BJP )రాజకీయ వ్యూహం ఎవరికి అంతుపట్టడం లేదు.తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

రేపు నోటిఫికేషన్ కూడా వెలువడనుంది.ఈ నేపథ్యంలో బిజెపి తమ పార్టీ తొలి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది .మరోవైపు జనసేన పార్టీతో( Janasena Party ) పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైంది.12 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు బిజెపి సిద్దమైనట్లు సమాచారం.దీంతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో జనసేన , బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతుండడం ఖాయంగా మారింది.

  మరోవైపు చూస్తే తెలంగాణ టిడిపి ( TDP )కూడా బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది .తమ పార్టీ తరఫున టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరించినా,  అభ్యర్థులను మాత్రం ఇంకా ప్రకటించలేదు.  ఏ క్షణమైన బీజేపీతో పొత్తు కుదురుతుందని , ఆ పొత్తులో భాగంగా బిజెపి కేటాయించే సీట్లలో అభ్యర్థులను ప్రకటించవచ్చని టిడిపి ఎదురుచూస్తోంది.

కానీ టిడిపిని కలుపుకుని వెళ్ళేందుకు బిజెపి ఏమాత్రం ఇష్టపడడం లేదు.అయితే జనసేనతో బిజెపి పొత్తు కుదుర్చుకున్నా,  అది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు .దీనిపై పవన్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందని అంత భావిస్తున్నారు .టిడిపిని కాదని జనసేనకు బిజెపి ప్రాధాన్యం ఇస్తోంది.  ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను( Amit Shah ) నారా లోకేష్( Nara Lokesh ) కలిశారు.

Advertisement

ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీలో బిజెపితో పొత్తు అంశం పైన చర్చ జరిగి ఉంటుందని , త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందని అంత భావించారు.కానీ బిజెపి తన తొలి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

  52 మంది అభ్యర్థులతో ఉన్న ఈ జాబితాలో టిడిపికి బలమున్న స్థానాలు ఎక్కువగా ఉండడంతో టీడీపీతో పొత్తు కు బిజెపి సిద్ధంగా లేదు అనే విషయం అర్థం అవుతోంది .

కేవలం జనసేన మద్దతు మాత్రమే కోరుకుంటున్నారనే విషయం క్లారిటీ వచ్చింది. బిజెపి ( BJP )వైఖరి పై ఇప్పటికే క్లారిటీకి వచ్చిన టిడిపి తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.  అధినేత చంద్రబాబు ఆమోదముద్ర రాగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనే ఆలోచన లో తెలంగాణ టిడిపి ఉంది.

ఈ విషయం లో జనసేన కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది .ఏపీలో టీడీపీ,  జనసేన పొత్తు ఖాయమైన తెలంగాణలో టిడిపిని కాదని బిజెపితో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో తర్జనభజన పడుతోంది.అసలు తెలంగాణలో టిడిపికి ఓటు బ్యాంక్ ఎక్కువగానే ఉన్నా, బిజెపి ఎందుకు పక్కన పెడుతోంది అనే విషయంలో జనసేన కూడా ఆలోచనలో పడింది.

ఆ సినిమాలో 100 మందితో ఫైట్ సీన్.. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సీన్ ఇదేనంటూ?
ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు