వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనగానే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు తడిసిపోయింది.ఓటమి భయం వైసీపీ నాయకుల్లో స్పష్టంగా తెలుస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ తప్పదు సీఎం జగన్ రెడ్డికి డబ్బు పిచ్చి.నోట్ల కట్టల వాసన చూడనిదే నిద్రపట్టదు.
ఆస్తిలో వాటా ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని తోడబుట్టిన చెల్లినే గెంటేశాడు.సీఎం ఢిల్లీ వెళ్లేది సొంత పనులు చక్కబెట్టుకోవడానికే.
రాష్ట్రం పాలిట దుష్టచతుష్టయం జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులుచవాకులు పేలితే నాలుక కోస్తాం.
నీలి చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్లు కొందరు వైసీపీ నేతలు.విజయవాడ మీడియా సమావేశంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్.
వైఎస్ఆర్ విముక్త ఆంధ్రప్రదేశ్ మా ఎన్నికల వ్యూహం అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించగానే తాడేపల్లి ప్యాలెస్ లోని ప్రభుత్వ పెద్దలకు, సలహాదారులకు తడిసిపోయిందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ ఎద్దేవా చేశారు.ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనను అంతమొందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే వైసీపీ నాయకుల్లో భయం మొదలైందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కష్టమని డిసైడ్ అయిపోయి ఇష్టానుసారం అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ తప్పదని, సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.మంగళవారం ఉదయం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లుగా వైసీపీ ఏనాడూ సామాజిక న్యాయం పాటించలేదు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు ఇలా ఏ వర్గానికీ సరైన రాజకీయ సాధికారత ఇవ్వలేదు.
ప్రెస్ మీట్లు పెట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి మాత్రం జగన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తున్నారు.ఆ రెండు కంపెనీల నుంచే ఏడాదికి రూ.35 వేల కోట్లు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జేపీ వెంచర్స్, జే బ్రాండ్ అనే రెండు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ రెండు కంపెనీల నుంచి ఏడాదికి రూ.35 వేల కోట్లు దండుకుంటున్నారు.ఇసుక తవ్వకాలను జేపీ వెంచర్స్ కు అప్పగించి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు.
మద్యపాన నిషేధం అని చెప్పి రకరకాల పిచ్చి బ్రాండ్స్ తీసుకొచ్చి మద్యం ఏరులై పారిస్తున్నారు.కొంతమంది మంత్రులు వ్యభిచారుల్లా తయారయ్యారు.పార్టీ జెండాలో ఉన్న నీలి రంగును ఆదర్శంగా తీసుకొని నీలి చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు.
సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు.వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారని మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీదా, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
రోడ్ల దుస్థితి ప్రపంచానికి తెలియాలని డిజిటల్ క్యాంపెయిన్, సామాన్యుడి గళం వినిపించేలా జనవాణి, కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర వంటి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించడంతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.ఆయనకు కులాన్ని ఆపాదించి వేరే పార్టీతో లింకు పెడుతున్నారు.
కులాల మధ్య చిచ్చు పెట్టే మీ ప్రయత్నాన్ని తిప్పికొడతాం.
మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే నాలుకలు కోస్తాం.
ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల నుంచి లక్షల కోట్లు వెనకేసుకుంటున్నారు.బకాసురుడు మాదిరి మంది సొమ్ము తింటున్నారు.
బకాసురుడు వారసులు వైసీపీ నేతలు.ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? ఒక్క పెట్టుబడిని తీసుకొచ్చారా? 32 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కనీసం 32 మందికైనా ఉద్యోగం ఇచ్చారా? అధికారానికి దూరంగా ఉన్న కులాలను కలుపుకొని అధికారంలోకి వస్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే మీకెందుకు అంత ఉలిక్కిపాటు.
మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశయాలు తప్ప ఆస్తులు లేవు.
ఆయనకు జగన్ రెడ్డిలా ఫ్యాక్టరీలు, ప్యాలెస్ లు లేవు.సండూర్ పవర్, భారతీ సిమెంట్, సాక్షి పేపర్, సాక్షి ఛానల్ వంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లేవు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించిన ఆయన.అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల కోట్లు సంపాదించారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.ఆయనకు ఉన్న డబ్బు పిచ్చి వల్ల నోట్ల కట్టల వాసన చూడనిదే నిద్రపట్టదని చర్చించుకుంటున్నారు.
ఆస్తుల మీద మమకారంతో సొంత చెల్లికి ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందోనని ఇంటి నుంచి వెళ్లగొట్టారు.సొంత చెల్లికి చిల్లిగవ్వ ఇవ్వని ముఖ్యమంత్రికి ఎంత డబ్బు పిచ్చి ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలి.
శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై అవాకులు చవాకులు పేలే వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాం.మా నాయకుడి మీద సీబీఐ, ఈడీ కేసులు లేవు.
సూటు కేసు కంపెనీలు పెట్టి ప్రభుత్వాలను మోసం చేయలేదు.అక్రమ ఆస్తుల కేసులో 16 నెలలు జైల్లో కూర్చొని రాలేదు.
నిజంగా వైసీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే పార్లమెంటులో ప్రతాపం చూపించాలి.ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలి.
జగన్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు.కేంద్ర పెద్దలను కలుస్తున్నారు.
శాలువాలు కప్పుతున్నారు తప్ప రాష్ట్రానికి రూపాయి ఉపయోగం ఉండటం లేదు.మీ నాయకుడు ఢిల్లీ వెళ్తుంది ప్రజల కోసమా? లేక పర్సనల్ పనుల కోసమా? ఢిల్లీలో కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పి అక్కడ నిలబడలేక వంగిపోతున్న మాట వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పాలి.ఢిల్లీలో జరిగినా పరిణామాలపై ఏనాడైనా ముఖ్యమంత్రి నోరు తెరిచారా? ఒక్క మీడియా సమావేశం పెట్టి మాట్లాడారా? ఢిల్లీ వెళ్లి ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలి.ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ మహిళ నాయకులు ఇష్టానుశారం బూతులు మాట్లాడుతున్నారు.
మీరు జగన్ మాయలో పడి రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.సభ్యసమాజం తలదించుకునేలా బూతులు మాట్లాడి మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించొద్దు.
రాష్ట్రానికి పట్టిన దుష్టచతుష్టయం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి. ఈ నలుగురూ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి దోచుకుంటున్నారు.
ఒక్క ఛాన్సు పేరుతో వచ్చి ప్రజల మీదపన్నుల మీద పన్నులు వేసి నడ్డి విరుస్తున్నారు.ఇంటి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీల పెంపు ఇలా ఒక దాని పై ఒకటి వేసి వీరు బాదుడు బాదుతున్నారు.
జగన్ పేరు చెబితే జనం పారిపోయే పరిస్థితి.ఈయన పాలన ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
గోతుల పడ్డ రోడ్లను పూడ్చినా, అమరావతి రైతులకు అండగా నిలబడినా, నివర్ తుపాన్ సమయంలో రైతు కష్టాలు తెలుసుకున్నా, కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడినా అది శ్రీ పవన్ కళ్యాణ్ గారే.వైసీపీ పాలిట మాత్రం ఆయన కాలయముడు.
రానున్న రోజుల్లో వైసీపీ విమర్శలు తిప్పికొట్టి, ప్రజా మద్దతు కూడగడతాం.జనసేన పార్టీ ప్రభుత్వాని ఏర్పాటు చేసి తీరుతాం.
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ .ఆయన తండ్రి గారు ఎలా మరణించారో బయటకు చెప్పగలరా? మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే మరణానికి గల కారణం చెప్పండి.గుడివాడ అమర్నాథ్ కి పిల్లనివ్వడానికి విశాఖ ప్రాంతంలో చాలా మంది ఆలోచించిన మాట నిజం కాదా? అమర్నాథ్ తో పెళ్లి అంటే బిడ్డ జీవితం ఏమవుతుందో అని భయపడిపోయారు.వీటికి ముందు సమధానం చెప్పండి.
తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుదాం.మరో మంత్రి దాడిశెట్టి రాజా కూడా విమర్శలు చేస్తున్నారు.
దొంగ బంగారం, గంజాయి స్మగ్లింగ్ చేసి యువత జీవితాలతో ఆడుకుంటున్న ఆయన కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు.ఇంకొక మంత్రి జోగి రమేష్.
ఆయన జోగి రమేష్ కాదు జోకర్ రమేష్.ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు.
ఓట్లు వేయకపోతే పథకాలు ఆపేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తాడు.ఇక బెజవాడ బ్రహ్మానందం వెల్లంపల్లి కూడా విమర్శలు చేస్తున్నారు.
సామాజిక న్యాయం కోసం స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఇలాంటి కోవర్ట్, వెన్నుపోటుదారుల వల్లే విలీనం అయ్యింది.ఆనాడు ఈయన రాజశేఖర్ రెడ్డి కోవర్టుగా మారి చిరంజీవి గారిని బలిపశువును చేశారు.
పదిమంది నిలబడితే పార్టీని ముందుకు తీసుకెళ్తానని ఆనాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెబితే ఒక్కరు కూడా నిలబడలేదు.ప్రజారాజ్యం పార్టీ విలీనంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకపోయినా ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
మాజీ మంత్రి కొడాలి నాని మంత్రి పదవి పోయాక పిచ్చొడిలా మరిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు.ఇలాంటి వాళ్లందరూ అవాకులు చవాకులు పేలితే ఉపేక్షించేది లేద"ని హెచ్చరించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy