చంద్రబాబును కలిసిన జనసేనాని పవన్

హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిశారు.

ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు.

అనంతరం చంద్రబాబును పరామర్శించిన జనసేనాని ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.అయితే ఏఐజీ ఆస్పత్రిలో రెండు రోజుల పాటు వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు ఇవాళ కంటి పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయనకు మంగళవారం కంటి ఆపరేషన్ జరగనుంది.అటు ఏపీలో టీడీపీతో జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..
Advertisement

తాజా వార్తలు