గ్రౌండ్ రియాలిటీ కి దగ్గరగా జనసేన

జనసేన అదినేత( Janasena Leader ) ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ కి దగ్గరవుతున్నారట .సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని సినిమా రంగంలో తాను తిరుగులేని హీరో అయినందున తాను ఎక్కడికి వెళ్లినా సమీకరించాల్సిన అవసరం లేకుండానే జనం పోగవుతారు.

 Janasena Pawan Kalyan Varahi Yatra Uttarandhra Tour,uttarandhra Tour,janasena,pa-TeluguStop.com

అయితే వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్లడానికి చాలా ఫ్యాక్టర్స్ కారణం అవ్వాలి.బూతు లెవెల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్థానిక నేతల కోఆర్డినేషన్ వరకూ అనేక ఏర్పాట్లు చేసుకోవాలి.అంతేకాకుండా ప్రజల్లో ఈయనను నాయకుడిగా గెలిపించుకోవాలన్న బలమైన సంకల్పం వచ్చే విధంగా ఆలోచనలు కూడా పుట్టించాలి.2019 ఎన్నికల్లో ప్రజలు నాడిని పట్టుకోవడం విఫలమైన జనసేనా ని ఇప్పుడు వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Ap, Janasena, Pawan Kalyan, Uttarandhra, Varahi Yatra-Telugu Political Ne

ఇప్పుడు తన బలాన్ని బలహీనతలు స్పష్టంగా గ్రహించిన పవన్ బలహీనతలను తగ్గించుకుంటూ బలం పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ముఖ్యంగా రాజకీయంగా తన బలం ఎక్కడుందో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గ్రహించారనే చెప్పాలి .తన సామాజిక వర్గ మద్దతుతో పాటు జనసేనకు అనుకూలంగా ఉన్న వర్గాలు తటస్తులుగా ఉండి సానుభూతిపరులుగా ఉన్న వర్గాలని గుర్తించిన జనసేనా ని ఇప్పుడు ఆయా వర్గాల మద్దతును బలపరుచుకుంటూ అదికారం వైపు గురి పెడుతున్నారు.అందులో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల యాత్రను సూపర్ సక్సెస్ చేసుకున్న జనసేనా ని ఇప్పుడు ఉత్తరాంధ్రలో మూడో విడత యాత్ర( Varahi Yatra )కు అతిపెద్ద లక్ష్యాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Ap, Janasena, Pawan Kalyan, Uttarandhra, Varahi Yatra-Telugu Political Ne

దీనికి దీనిపై జాతీయ మీడియా దృష్టి కూడా ఉంటుందని మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలంటూ స్థానిక నేతలకు ఇప్పటికే సూచనలు ఇచ్చిన జనసేన అధినేత గోదావరి జిల్లాలను మించి ఉత్తరాంధ్ర పర్యటన( Uttarandhra )ను విజయవంతం చేయాలని టార్గెట్ నిర్దేశించుకున్నట్లుగా తెలుస్తుంది.జిల్లా వారీగా ప్రభావం చూపగల కీలక నేతలను ఈ యాత్ర వేదికగా పార్టీలోకి చేర్చుకోవాలని అందుకు తీసుకోవాల్సిన చర్యలను ఇప్పటికే ఉత్తరాంధ్ర కీలక నేతలతో చర్చించినట్లుగా తెలుస్తుంది.ఒకవైపు ప్రభుత్వం పై విమర్శలు బాణం ఎక్కు పెడుతూనే జనసేన ని ఎందుకు ఎన్నుకోవాలో ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి జరగబోయే మంచిని మరింత విశ్లేషణాత్మకంగా వివరించాలని ,దాంతో దేశం మొత్తం దృష్టి జనసేన పై పడుతుందని పవన్ కళ్యాణ్ లెక్కలేసుకున్నట్టుగా తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube