సహజంగా సినిమా నటుడైన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలలో చూపించే సస్పెన్స్ ను రాజకీయాల్లో కూడా అనుసరిస్తున్నారు.తెలంగాణ ఎన్నికలపై( Telangana Elections ) పోటీ విషయంలో ఆ పార్టీ వ్యవహార శైలి ముందుకా వెనక్కా అన్నది తెలంగాణ జనసైనికులు ఏమాత్రం అంతు పట్టడం లేదు .
ఈసారి పోటీ చేయకపోతే తెలంగాణలో పార్టీ పూర్తిగా అంతర్దానమైపోతుందన్న విశ్లేషణల నడుమ కచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన( Janasena ) 32 మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది .అయితే చివరి నిమిషంలో భాజపా ఎంట్రీ తో సమీకరణాలు మారాయి.పోటీ చేయకుండా మద్దతు ఇవ్వమన్న బజాపా రిక్వెస్ట్ ను సున్నితం గా తిరస్కరించిన జనసేన ఈసారి కచ్చితంగా కొన్ని స్థానాలలో పోటీ చేయాల్సిన అవసరాన్ని బజాపా కి వివరించింది.
ఒక రాజకీయ పార్టీ గా ఇది తమకు ఉనికి సమస్య అని ఇప్పటికే పొత్తులలో భాగంగా భాజాపాకు( BJP ) చాలాసార్లు మద్దతు ఇచ్చామని ఈసారి తమకు కూడా ఒక అవకాశం ఇవ్వమంటూ అడిగినట్టుగా తెలుస్తుంది.దాంతో బాల్ ఢిల్లీ కోర్టుకు చేరింది.కీలక నాయకుడు అమిత్ షా తో( Amit Shah ) బేటి కూడా జరిగింది .అయినప్పటికీ జనసేన పోటీపై ఇప్పటికి స్పష్టమైన సమాచారం లేదు.మరోపక్క అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లికి( Varuntej Marriage ) ఇటలీ కి వెళ్లిపోవడం తో ఇప్పుడు తెలంగాణలో పోటీపై సస్పెన్స్ మరింత పెరిగింది.
అటు ఇటుగా ఆయన మరొక వారం రోజుల వరకూ అందుబాటులో ఉండటం లేదని తెలుస్తుంది.దాంతో నామినేషన్లు గడువు దగ్గర పడటంతో జనసైనికుల టెన్షన్ తారా స్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది.
మరి సినిమాలలో సస్పెన్స్ బాగానే ఉంటుంది కానీ రాజకీయాల్లో ఎంత క్లారిటీగా ఉంటే ఫలితాలు అంతా బాగా వస్తాయని, ఒక పక్క బిజెపి పూర్తిస్థాయి పోటీపై సమలోచనలు చేస్తుండడంతో పవన్ తెలంగాణలో కాడి వదిలేసారా? అన్న చర్చ కూడా సాగుతుంది.అయితే భాజాపా నేతలతో పవన్ టచ్ లోనే ఉన్నారని కీలకమైన సంప్రదింపులు జరుగుతున్నాయని, మరో ఒకటి రెండు రోజుల్లోనే జనసేన లిస్టు బయటకు వస్తుందని జనసేన నుంచి లీకు లు వస్తున్నాయి.