కాపు ఉద్యమనేత , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) జనసేన లో చేరబోతున్నారంటూ హడావుడి జరిగింది.ముద్రగడ పద్మనాభం తో పాటు, ఆయన కుమారుడు గిరి కి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలనే షరతు విధించింది మరీ ముద్రగడ జనసేనలో( Janasena ) చేరుతున్నారనే ప్రచారం జరిగింది.
దీనికి పవన్ సైతం సానుకూలంగానే స్పందించారు.టిడిపి వైసిపిలోకి వెళ్లే ప్రసక్తే లేదని ముద్రగడ కూడా ప్రకటించారు.
అయితే స్వయంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముద్రగడ నివాసానికి వెళ్లి మరీ ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారని ప్రచారం జరిగింది. దీంతో ముద్రగడ జనసేనలో చేరిక ఖాయమని, ముద్రగడతో చర్చించిన తర్వాత అధికారికంగా ఈ ప్రకటన వెలువడుతుందని అంత భావించారు.
అయితే తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది .కానీ ముద్రగడ పద్మనాభం నివాసానికి పవన్ వెళ్లలేదు .దీనిపై ముద్రగడ కూడా పరోక్షంగా సెటైర్లు వేసినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది.దీంతో ముద్రగడను చేర్చుకునే విషయంలో పవన్ కళ్యాణ్ అంత సానుకూలంగా లేరని, తమ పార్టీలో చేర్చుకుంటే ఆయన పెట్టే డిమాండ్లు రాబోయే రోజుల్లో తమకు ఇబ్బందికరంగా మారుతాయి అని పవన్ అభిప్రాయపడుతున్నట్లుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.
వాస్తవంగా ముద్రగడ పద్మనాభం వైసీపీలో( YCP ) చేరుతారని ముందుగా అంతా భావించారు.
కానీ ఆయనకు, ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చే విషయంలో జగన్( CM Jagan ) అంత సానుకూలత చూపించకపోవడంతో ఆ పార్టీపై ఆగ్రహంతో జనసేనలో చేరాలని ముద్రగడ నిర్ణయించుకున్నారు.కానీ ఇప్పుడు పవన్ సైతం పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో ముద్రగడ రాజకీయంగా డైలమాలో పడ్డారు.టిడిపి తో జనసేన పొత్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ముద్రగడను జనసేన లో చేర్చుకునే విషయంలో టిడిపి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతాయని పవన్ భావిస్తుండడంతోనే ఆయన ఈ విషయంలో సైలెంట్ అయినట్టుగా అర్థమవుతుంది.