జనసేనకి ఫైనాన్షియర్ ఆ నిర్మతేనా ..?       2018-05-19   06:58:31  IST  Raghu V

జనసేన జోరుగా అడుగులు వేస్తూ … ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్దం అయిపోతోంది. దీనిలో భాగంగానే శ్రీకాకుళం జిల్లా నుంచి బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి పార్టీని తీసుకెళ్లాలని జనసేనాని తెగ ఆరాటపడిపోతున్నాడు. దీనికి అనుగుణంగానే పార్టీల్లో కొంతమందికి కీలక బాధ్యతలు అప్పగించి టీంలుగా డివైడ్ చేసాడు. అందుకే జనసేన త‌ర‌ఫున ఐటీ, సోష‌ల్ మీడియాలో క్రియాశీల‌మైన పాత్ర పోషించేందుకు ఏర్ప‌డిన ఈ విభాగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు పవన్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అయితే ఇదంతా సాధారణ విషయమే అయినా అసలు జనసేనకు నిధులు ఎక్కడి నుంచి సమకురుతున్నాయి అనేది ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న సందేహం.

ఈ నేప‌థ్యంలో పవన్ వెనక ఉండి ఒక నిర్మాత అన్నీ చూసుకుంటున్నారు అనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఇంతకీ జనకు అన్ని తానై నడిపుస్తున్న ఆ నిర్మత ఎవరా ఎవరా అనే చర్చ సాగుతోంది.

ఈ దశలో కొన్ని పేర్లు బయటకి వినిపించాయి అందులో .. పవన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్న బండ్ల గణేష్, శరత్ పేర్లు వచ్చినా .. జనసేనకి అండగా ఉంటూ నడిపిస్తున్నది మాత్రం చుట్టాలబ్బాయి సినిమాతో నిర్న్మాతగా మారి ఇటీవలే రవితేజతో నేల టికెట్ తెరకెక్కించిన రాం తాళ్ళూరి అని అత్యంత విశ్వసనీయ సమాచారం. రాం క్రియాశీల రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు.

స్వతహాగా ఎన్నారై అయిన రాం జ‌న‌సేన‌ను తన రాజకీయ ఎంట్రీ కి ఎంచుకున్నారని. అందుకే, ఈయ‌న ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీకి సంబంధించి చాలా అవ‌స‌రాల‌కు నిధులు సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ -రామ్ మంచి స్నేహితుల‌ని మొదటి నుండి అమెరికాలో జ‌న‌సేన పార్టీ ప్రచారానికి సంబంధించిన ప‌నుల‌ను, అమెరికా ఎన్. ఆర్. ఐ వింగ్ కు సంబంధించి డీలింగ్స్ అన్నీ రామ్ ఆధ్వర్యంలోనే సాగుతున్నాయట..

ఇటీవల నేల టికెట్ ఆడియో ఫంక్షన్ కి కూడా ఇదే చనువుతో పవన్ హాజరయ్యారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ త‌ల‌పెట్టిన బ‌స్సుయాత్ర‌కు కూడా రామ్ తాళ్లూరినే కర్త, కర్మ అని తెలుస్తోంది. అమెరికాతోపాటు, హైద‌రాబాద్ లో కూడా ఆయ‌న‌కి కొన్ని కంపెనీలున్నాయి. ఎలా అయినా పవన్ సారధ్యంలో 2019 ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోవాలని రామ్ కలలు కంటూ వాటిని సాకారం చేసుకునే పనిలో ఉన్నాడు.