హిందువులు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా తొలుత గణేష్ పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని అటువంటి రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు నిషేధించడం దారుణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.పొరుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలకు షరతులతో కూడిన అనుమతి ఇస్తే ఇక్కడ పూర్తిగా నిషేధించడం అర్థరహితమని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
మంగళవారం సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు ఈ ఉత్సవాలకే వర్తిస్తాయా.? వైకాపా నేతల పుట్టినరోజులు, సభలకు వర్తించవా.? అని ప్రశ్నించారు.తక్షణమే ప్రభుత్వంంచెప్పి దాన్ని సరి చేసుకుని యాక్షన్ ఉపసంహరించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
రాష్ట్రంలో రోడ్ల దుస్థితి పై ఆయన మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు రాష్ట్ర రహదారులు మృత్యుకుహరాలుగా మారాయని వ్యాఖ్యానించారు.అక్టోబర్ నుంచి రోడ్డు మరమ్మతులు నిర్మాణం చేపడతామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రులు రోడ్డుతో పాటు పోర్టులు, ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని అయితే పోర్టులు ఎయిర్ పోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామమాత్రమేనని అన్నారు.సొంతిల్లు చిమ్ముకోడాని చీపురు లేదు గాని.
పక్కిల్లు చిమ్మేసి ముత్యాలముగ్గు వేస్తామన్నా చందంగా మంత్రుల వ్యాఖ్యలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.

హస్తినలో పవన్ కళ్యాణ్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మకాం వేశారు.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు ప్రహ్లాద్ జోషి తో సమావేశమైన అనంతరం మరికొందరు బిజేపి నేతలతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం అలాగే రాష్ట్రంలో బిజేపి- జనసేన ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో చర్చించారు.