ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపే దిశగా జనసేన, బిజేపీ

బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం మంగళగిరిలో జనసేన రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయి తాజా పరిణామాలపై చర్చించారు.

ఇరు పార్టీలకు సంబంధించిన బలాబలాలపై కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.

జనసేన పార్టీ అభ్యర్థనా.లేక భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థిని పోటీ చేయించాలనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.ఈ సందర్భంగా జనసేన తరపున రెండు పేర్లను భారతీయ జనతా పార్టీ తరఫున మరో రెండు పేర్లను ప్రాథమికంగా పరిశీలించారు.

జనసేన పార్టీ తరఫున అభ్యర్థ.లేక బిజేపీ తరఫున అభ్యర్థులు బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ కి ఎవరని నిలబడతారన్నది, అభ్యర్థి విషయంపై ఎవరిని పోటీలో పెడతారు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు ఈ భేటీలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

Advertisement
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

తాజా వార్తలు