రామతీర్థం లో రాజకీయం : ఉద్రిక్తంగా మారిన జనసేన బీజేపీ యాత్ర ?

ఉత్తరాంధ్ర లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారిపోయింది.

విజయనగరం జిల్లా లో ఉన్న పురాతన రామతీర్థం ఆలయం కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది.

అక్కడ ఆలయంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం,  రాముడు విగ్రహం నుంచి తలను వేరు చేసి దానిని కొలను లో వేసిన ఘటన, ఆ తరువాత రాజకీయం గా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.ఈ వ్యవహారంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ పై రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెట్టి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, ఈ ప్రాంతాన్ని సందర్శించే నిమిత్తం వివిధ రాజకీయ పార్టీలు హడావుడి చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.

 ఈరోజు జనసేన బిజెపి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఈ యాత్ర భారీగా ప్రారంభం కావాల్సి ఉంది .అయితే ముందుగానే ఈ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించడం , ఎక్కడికక్కడ బిజెపి జనసేన నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో తీసుకోవడం, నాయకుల ఇళ్ల వద్ద పోలీసు పహారా పెట్టడం వంటి కారణాలతో రామతీర్థం యాత్ర కాస్త ఉద్రిక్తంగా మారింది.రామతీర్థం కు వెళ్లే రోడ్లకు అడ్డంగా బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు.

  ఈ తెల్లవారు జాము నుంచే రామతీర్థం కొండ పైకి ఎవరు వెళ్ళకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు పోలీసులు చేశారు.ఈ ధర్మ యాత్రలో భాగంగా విశాఖ నుంచి రామతీర్థం వరకు బీజేపీ, జనసేన నేతలు భారీ ర్యాలీ చేపట్టారు.

Advertisement

ఈ ర్యాలీ లో రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి సునీల్ దేవధర్ తో పాటు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్, జనసేన నుంచి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో పాటు మరి కొంతమంది నాయకులు పాల్గొనబోతున్నారు.ఈ దీక్షకు ఎటువంటి అనుమతులు లేదని పోలీసులు స్పష్టం చేశారు.రామతీర్థం లో 144 సెక్షన్ తోపాటు 30 యాక్ట్ అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం రామతీర్థం యాత్రకు బయలుదేరిన బిజెపి జనసేన నాయకులు కొంతమంది పోలీసులు అడ్డుకోవడం అరెస్టు చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ను పోలీసులు అడ్డుకోవడం వంటి సంఘటనలతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు