చాప కింద నీరులా చక్కబెట్టుకుంటున్న జనసేన!

అధికారికంగా ఎన్డీఏలోకి చేరి కేంద్ర పెద్దలతో చర్చల తర్వాత జనసేన( Jana sena )లో కొత్త ఊపు కనిపిస్తుంది.

జనసేనాని ఆత్మ విశ్వాసం తో అడుగులు వేస్తున్నారు .

ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఎన్డీఏ ఏపీలో అధికారంలోకి వస్తుందని గట్టిగా మాట్లాడిన పవన్ ఇప్పుడు టికెట్ల కేటాయింపు పై తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.తెలుగుదేశంతో పొత్తులు కచ్చితంగా ఉంటాయని తెలిసినా కూడా కొన్ని కీలకమైన నియోజకవర్గాలలో తమ పార్టీకి పట్టున్న నియోజకవర్గాలలో ఇన్చార్జిలను ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు.

ముఖ్యంగా పవన్ ప్రకటిస్తున్న నియోజకవర్గాలు అన్ని ఒకప్పుడు జనసేనకు భారీగా ఓట్లు సంపాదించి పెట్టిన నియోజకవర్గాలు, అంతేకాకుండా అక్కడ టిడిపి( TDP ) ఓటమిని శాసించిన నియోజకవర్గాలు.చాలా తక్కువ మార్జిన్లతో వైసిపి అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు.

తద్వారా పొత్తులో భాగంగా ఈ సీట్లును తమకు వదులుకోకపోతే మళ్లీ 2019 నాటి ఫలితాలే పునరావృతం అవుతాయని టిడిపిని హెచ్చరించడానికి ఇలా ఈ నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులను ప్రకటిస్తుందని రాజకీయ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తమ బలం ఉన్నచోట కచ్చితంగా పోటీ చేస్తామని పవన్ చెప్పినట్లుగానే తమ సామాజిక వర్గ ప్రజలు, పార్టీ సానుభూతిపరులు అధికంగా ఉండి తమకు ప్రజారాజ్యం సమయం నుంచి కలిసి వస్తున్న నియోజకవర్గాలకు ముందుగానే కర్చీ వేసినట్లుగా పవన్( Pawan kalyan ) వ్యవహరిస్తున్నారు.తద్వారా పొత్తులో కచ్చితంగా ఈ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి టీడీపీకి సృష్టించడం ద్వారా బేరసారాలను ముందే ఫైనల్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది.తమకు బలం లేనిచోట ఎక్కువ సీట్లు కేటాయించి బలమైన చోట తెలుగుదేశం తీసుకుంటుందన్న అనుమానాలు జనసైనికులు లో వినిపిస్తున్న చోట తెలుగుదేశం కంటే తాను రెండాకులు ఎక్కువే చదివానన్న సంకేతాలు ఇవ్వడానికే పవన్ ఈ డేరింగ్ స్టెప్ తీసుకున్నారని తెలుస్తుంది .

పొత్తులు ఇరుపక్షాలకు అంగీకార యోగ్యంగాను, ఆమోదయోగ్యంగాను ఉండాలని గౌరవప్రదమైన పరిస్థితి ఉంటే మాత్రమే పొత్తులు పెట్టుకుంటాను అన్న పవన్ ఆ దిశగా తన శ్రేణులకు సంకేతాలు ఇవ్వడానికి ఇన్చార్జుల ను నియమిచ్చినట్టుగా తెలుస్తుంది .జనశెన జెండా పట్టుకున్న ఎవ్వరికీ అన్యాయం జరగదని , పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి పొత్తు పేరు తో అన్యాయం చేయరని జనసేన ఇన్చార్జిగా ప్రకటించిన ప్రతి అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో జనసేనకి ఎమ్మెల్యే అభ్యర్థి గా అయి తీరుతాడని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు