చిరంజీవినే ప్రశ్నిస్తున్న జనసైనికులు.. లైట్ తీసుకోమన్న మెగా బ్రదర్

ఏపీలో జనసేనపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.దీనికి కారణం లేకపోలేదు.

 Soldiers Questioning Chiranjeevi Himself.. Mega Brother Who Wants To Take The Li-TeluguStop.com

ఇటీవల జనసైనికులు మెగాస్టార్ చిరంజీవినే ప్రశ్నించిన విషయం తెలిసిందే.దీనిపై అటు కొందరు మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా తీవ్రంగా మండిపడుతున్నారు.

జన సైనికులు నేరుగా చిరంజీవినే ప్రశ్నించిన జనసేన నేత పవన్ మరో సోదరుడు నాగబాబు సైతం ఫర్వాలేదంటూ లైట్ తీసుకోవడం ఏంటని విమర్శలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడంటే రాజకీయాల్లోకి వచ్చారు.

అయితే ఆయన సినిమాల్లోకి ప్రవేశించడానికి ప్రధాన కారణం చిరంజీవినే అన్న సంగతి తెలుగు ప్రేక్షకులకు, అభిమానులందరికీ తెలిసిన విషయం.చిరంజీవి చెప్పడం వలనే పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆయన తోడుతోనే ఇండస్ట్రీలో మెల్లగా ఎదిగారనే విషయం ఆ కుటుంబ సభ్యులే పలుమార్లు చెప్పారు.కానీ ఇటీవల పవన్ అభిమానులు ఏకంగా చిరంజీవినే ప్రశ్నించే స్థాయికే చేరారు.

ఇటీవల రాష్ట్రంలో వారాహి విజయ యాత్రలో భాగంగా పలు ప్రకటనలతో పాటు ఊగిపోతూ పలు ప్రసంగాలు ఇచ్చారు జనసేనాని.అయితే మొన్న ఒక మాట.నిన్న ఒక మాట.ఇవాళ ఒక మాట అంటూ సొంత పార్టీ నేతలకే అర్థం కాని విధంగా ఆయన మాట్లాడారనే వాదనలు కొనసాగుతున్నాయి.దీంతో ఆయన రాజకీయ నేతగా పనికి రాడంటూ ఇతర పార్టీ నేతలు ఆరోపిస్తున్న వార్తలు నిజమేనా అనిపిస్తుందని అంటున్నారు కొందరు వ్యక్తులు.సినిమా హీరోగా తప్ప పొలిటిషీయన్ గా పవన్ పనికి రారని అర్థం అవుతుందంటున్నారట.

గతంలో స్వతహాగా పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్లలోనూ ఓడిపోయారు.ఇదే విషయాన్ని ఆయనే పలుమార్లు సమావేశాల్లో చెప్పారు.

తనను చూడటానికి జనాలు వస్తున్నారు తప్ప ఓట్లు వేయడం లేదంటూ వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఓట్లు వేయడానికి.

నాయకుడిగా గుర్తించడానికి ప్రజలు కొన్ని అర్హతలు నిర్ణయిస్తారు.అవేమి పవన్ కళ్యాణ్‌లో లేకపోవడంతో ఆయనను తిరస్కరించారని గతంలో తెలిసింది.

కానీ దీన్ని జీర్ణించుకోలేని, అంగీకరించలేని పవన్ అభిమానులు, ఇప్పుడు ఏకంగా చిరంజీవిని నిందిస్తున్నారట.

పవన్ కళ్యాణ్‌ను ప్రజలు నమ్మకపోవడానికి, ఆయన్ను అసలు సీరియస్ నాయకుడిగా చూడకపోవడానికి ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే కారణం అంటూ సోషల్ మీడియాలో ఓ కామెంట్ వివాదాస్పదంగా మారింది.

సామాజిక మాధ్యమాల్లో మొదటి నుంచీ యాక్టివ్ గా ఉండే రాయపాటి అరుణ అనే వీర మహిళ ఈ కామెంట్ చేసింది.చిరంజీవి నిర్ణయంతో ఇప్పుడు తమ పవన్ కళ్యాణ్‌ను ఎవరూ నమ్మడం లేదని, చిరంజీవి ఆనాడు పార్టీని విలీనం చేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉంటే.

తాము ఇప్పుడు బాధ పడుతున్నాం అన్నట్లుగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త వివాదానికి తెర లేపాయి.

అయితే చిరంజీవి ప్రోత్సాహం లేకపోతే కనీసం జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పవన్ ఎదిగే వాడు కాదని చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వీర మహిళ పోస్టుకు రిప్లై ఇస్తున్నారు.తమ అన్నయ్యకు విలీనం చేసేందుకు ఆనాడు కనీసం ఎమ్మెల్యేలు అయిన ఉన్నారంటున్న మెగాస్టార్ అభిమానులు మీకు ఆ దిక్కు కూడా లేదంటూ సమాధానం ఇస్తున్నారు.

మరికొందరు గెలవడం చేతకాక తమ అన్నయ్యను అంటారా అంటూ కౌంటర్లు ఇస్తున్నారని తెలుస్తోంది.

ఇరువురి అభిమానుల మధ్య వివాదం కొనసాగుతుండగా.

లైనులోకి వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు లీవిట్.వదిలేయండమ్మా.

ఆమె తెలిసీ తెలియక ఫ్లోలో అలా అనేసిందంటూ చెప్పారు.అంతేకాదు మొదటి నుంచి పార్టీలో ఉన్న మహిళా పట్టించుకోకండి అంటూ అభిమానులు శాంతపరిచారు.

తాత్కాళికంగా ఫ్యాన్స్ వివాదానికి తెర వేశారు కానీ పవన్ గెలవలేకపోవడానికి, చంద్రబాబు దగ్గర సరెండర్ అవడానికి చిరంజీవికి ఏం సంబంధం అంటూ ఆయన అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ క్రమంలో చిరంజీవి నీడన ఎదిగిన పవన్, ఆ విషయాన్నీ గుర్తించని జనసైనికులు పెద్ద అజ్ఞానులు అని చిరు ఫాన్స్ తో పాటు తెలుగు ప్రజలందరూ విమర్శలు చేస్తున్నారు.

అయితే ఇంత జరుగుతున్న ఈ వ్యవహారంపై ఇంకా పవన్ స్పందించలేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube