భారత సంతతికి చెందిన వైద్యుడు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బిమల్‌జిత్ సింగ్ సంధుకు( Dr Bimaljit Singh Sandhu ) అమెరికాలో కీలక పదవి దక్కింది.ఆయనను ఆరోగ్య రంగంలో కీలకమైన పరిపాలనా స్థానంలో నియమించారు వర్జీనియా గవర్నర్ గ్లెన్ యంగ్‌కిన్.
( Virginia Governor Glenn Youngkin ) బిమల్‌జిత్‌ను వర్జీనియా కామన్‌వెల్త్ యూనివర్సిటీ హెల్త్ సిస్టమ్ అథారిటీ బోర్డు సభ్యునిగా నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు మంగళవారం బిమల్‌జిత్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ హోదాలో ఆయన వర్జీనియా స్టేట్ హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కీలకపాత్ర పోషించనున్నారు.వర్జీనియాలో ఆరోగ్య వ్యవస్థ, మెడ్ స్కూల్, నర్సింగ్ స్కూల్, ఫార్మసీ స్కూల్ కార్యకలాపాలను పర్యవేక్షించడం ఈ డైరెక్టర్ల బోర్డు విధి

తన నియామకంపై డాక్టర్ సంధు స్పందించారు.తాము నిధుల సేకరణకు దిశానిర్దేశం చేస్తామని, వివిధ వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు వ్యూహాత్మక మార్గనిర్దేశం చేస్తామన్నారు.తద్వారా వర్జీనియన్లకు ఉత్తమ సంరక్షణను అందిస్తామని బిమల్‌జిత్ చెప్పారు.
పంజాబ్‌లోని( Punjab ) ఫరీద్‌కోట్‌కు చెందిన డాక్టర్ బిమల్‌జిత్ సింగ్ సంధు 2004లో వర్జీనియా కామన్‌వెల్త్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో( Commonwealth University ) గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఫ్యాకల్టీ మెంబర్‌గా అమెరికాకు వలస వచ్చారు.

ఇకపోతే.ఈ ఏడాది ఏప్రిల్‌లో మన్మీత్ కౌర్( Manmeet Kaur ) అనే భారత సంతతి మహిళ అమెరికా పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ చీఫ్‌గా బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే.ఈమె స్వగ్రామం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా భుల్లేచక్ గ్రామం.
మన్మీత్ సాధించిన ఘనతతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా మన్మీత్ కౌర్ తండ్రి కుల్వంత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.
తాను భారత నౌకాదళంలో పనిచేశానని, ఈ క్రమంలోనే తన కుమార్తె సైతం చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని నిర్ణయించుకుందని చెప్పారు.ముఖ్యంగా మన్మీత్‌కు పిస్టల్స్ అంటే చాలా ఇష్టమని.
కెరీర్ పట్ల ఆమెకు వున్న ఇష్టమే అమెరికాలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ స్థాయికి చేరేలా చేసిందన్నారు.చదువులో ఎంతో చురుగ్గా వుండే మన్మీత్.
అప్పటికే ఎఫ్‌బీఐలో పనిచేసిన బంధువులతో ప్రభావితమైందని చెప్పారు.







