భూకబ్జా విషయంలో ఓపెన్ ఛాలెంజ్ విసిరిన జ‌న‌గామ ఎమ్మెల్యే.. ?

తెలంగాణ రాజకీయాల్లో కొత్త వైరస్ ప్రవేశించిందట.అదే భూకబ్జాల వైరస్.

ఇది పాతదే అయినా ఇప్పటి వరకు కరోనా సెకండ్ వేవ్‌లా మారలేదు.

కానీ ఈటల పై చేసిన ఆరోపణల విషయంలో అవినీతి వైరస్ తీవ్ర రూపందాల్చిందట.

దీని వల్ల మరెందరో కబ్జా కోరు నాయకుల భాగోతాలు బయటకు వచ్చేలా ఉన్నాయని తెలంగాణ ప్రజలు ముచ్చటించుకుంటున్నారట.మొత్తానికి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల్లో పెను తుఫాను సృష్టించిందని అర్ధం అవుతుంది.

ఇదిలా ఉండగా గ‌తం లో ప‌లు సంద‌ర్భాల్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి ఏకంగా ఒక ఓపెన్ చాలెంజ్ విసిరారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈట‌ల వ్య‌వ‌హారంలో చేసిన కామెంట్ల‌కు స్పందించిన ఆయ‌న‌ తనకున్న అరవై ఎకరాలలో గుంట భూమి కబ్జా చేసిన‌ట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

Advertisement

అంటే తాను అవినీతిపరున్ని కాదని చెప్పకనే చెబుతున్నాడన్న మాట.మరి నిప్పు లేనిదే పొగ రాదుగా యాదన్న తప్పు చేయనప్పుడు ఆరోపణలు ఎందుకు ఎదుర్కొన్నట్లని ప్రజలు అనుకుంటున్నారట.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు