చెత్తమీద పన్ను వేసే చెత్త బ్యాచ్ వైసిపి బ్యాచ్ అని జనసేన రాష్ట్ర పిఏసి సభ్యులు పంతం నానాజీ అన్నారు...

చెత్తమీద పన్ను వేసే చెత్త బ్యాచ్ అందరూ కలిసి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని జనసేన రాష్ట్ర పిఏసి సభ్యులు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ఘాటుగా స్పందించారు.మంగళవారం గొడారిగుంటలో నానాజీ స్వగృహం వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

 Jana Sena State Pac Member Pantam Nanaji Said That Ycp Batch Is The Worst Batch-TeluguStop.com

సమావేశంలో నానాజి వైసిపి నాయకులను ఉద్దేశించి తీవ్రమైన వాఖ్యాలు చేసారు.వైసిపి నాయకులు గొప్పగా చెప్పుకుంటున్న నవరత్నాలు పధకాలు నవ రంధ్రాలనీ పేర్కొన్నారు.

మంత్రి దాడిశెట్టి రాజాను ఉద్దేశించి పైనుండి వచ్చే స్క్రిప్ట్ చదవటమే మంత్రి రాజా పని అని, గంజాయి, దొంగ బంగారం, వ్యాపారాలు చేయటం కాదనీ రాజకీయలంటే గంజాయి, దొంగ బంగారం, వ్యాపారాలు చేయటం కాదనీ విమర్శించారు.మీ నాయకుడు జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారనీ, భాజపాతో వ్యభిచారం చేయటానికి కాదా అని ప్రశ్నించారు.

జనసేన పార్టీను ఉద్దేశించి వైసిపి పేటియమ్ బ్యాచ్ అవ్వాకులు చవ్వాకులు వాగుతున్నారనీ, అసలు రాష్ట్రంలో చంచల్ గూడా బ్యాచ్ వైసిపినేనని ఎద్దేవా చేసారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి చేయవలసిన పనులు ప్రతిపక్షంలో ఉన్న జనసేన పార్టీ చేస్తుందనీ, రాష్ట్రంలో దాదాపు 3 వేలమందికి కౌలు రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకున్నామనీ, జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో 176 మంది కౌలు రైతులకు బరోశా ఇచ్చామనీ, ఎవరు ఎక్కడ ఉండాలో కాలం నిర్ణయిస్తుందనీ,అంతవరకు తొందర ఎందుకని, అన్నారు.

ఓడిపోయిన వారు గుండు కొట్టించుకునే పరిస్థితి వస్తే ముందు ఎవరు కొట్టించుకోవాలో చూసుకోవాలని, చంద్రబాబు, నాందేండ్ల సేన అని జనసేన పార్టీను విమర్శిస్తున్న వైసిపి వారు తమ పార్టీ చంచల్ గూడా పార్టీ అని మర్చిపోయారనీ ఎద్దేవా చేసారు.పార్టి కార్యాలయాలు వైసిపి పార్టీకు అవసరం లేదనీ ప్రతీ జిల్లాలో ఉన్న జైళ్లను పార్టీ ఆఫీసులుగా చేసుకోవాలనీ దుయ్యబట్టారు.

సంస్కారం గురించి వైసిపి పార్టీ నాయకులు చెబుతుంటే దెయ్యాలు వేధాలు వల్లించినట్టు ఉందనీ, బాబాయ్ హత్య, మిస్టరీ నేటికీ వీడకుండా ఉన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు.గడప గడప కు తిరుగుతున్న మీకు గుండు కొట్టింది, మీసాలు తీయించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాయలసీమ, రత్నాల సీమ అని కాకపోతే అక్కడ దోచుకునే వారి వలన జిల్లా వెనుకబడి ఉందనీ అన్నారు.

వైసపి విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారనీ అన్నారు.కాకినాడ రూరల్ నియోజకవర్గంలో భద్రతా ప్రమాణాలు పాటించకుండా చాలా ఫ్యాక్టరీలు నడుపుతున్నారనీ, మనిషి ప్రణాలకు విలువ కట్టి పోరాటం చేయవలసి వస్తుందని, ఆవేదన చెందారు.

వారం రోజుల్లో రూరల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలలో భద్రత ప్రమాణాలు పరిశీలించాలనీ, లేని పక్షంలో జనసేన పార్టీ సదరు ఫ్యాక్టరీల వద్ద ఆందోళన చేసి మూయించి వేస్తామనీ హెచ్చరించారు.కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు కరెడ్ల గోవింద్, తాటికాయల వీరబాబు, పుల్ల శ్రీరాములు, మురళి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube