‘బాహుబలి’ ఒక స్టుపిడ్‌

టాలీవుడ్‌ ఖ్యాతిని దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసిన సినిమా ‘బాహుబలి’.టాలీవుడ్‌ జక్కన్న తెరకెక్కించిన అద్బుత కావ్యం ‘బాహుబలి’.

బాలీవుడ్‌ సినిమాలను తలదన్నేలా కలెక్షన్స్‌ వచ్చాయి అంటే ప్రత్యేకంగా ఈ సినిమా గురించి చెప్పనక్కర్లేదు.అయితే కొందరు ఈ సినిమా గురించి బ్యాడ్‌గా మాట్లాడితే పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో చెత్త సినిమా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా అవే కామెంట్స్‌ను సీనియర్‌ నటి జమున చేశారు.హీరోయిన్‌గా ఎంతో అనుభవం ఉండి, తెలుగు సినిమా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాల్సింది పోయి ప్రస్తుత సినిమాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఈమె ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ.ప్రస్తుత సినిమాలు చూడాలని పించడం లేదు అని, అయితే తన మనవడి కోరిక మేరకు ‘బాహుబలి’ సినిమాను చూశాను అని, అయితే ఆ సినిమాలో టెక్నికల్‌ అంశాలు తప్ప మరేం లేవు అని, అంతా చెత్తగా సినిమా ఉందని, ‘బాహుబలి’ ఒక స్టుపిడ్‌ సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Advertisement

వయస్సు మీద పడ్డ ఈమె వ్యాఖ్యలపై ఏ ఒక్కరు పెద్దగా స్పందించడం లేదు.ఎవరేం అన్నా కూడా ‘బాహుబలి’ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సినిమా అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

వైరల్ వీడియో : విమానంలో కొట్టేసుకున్న ప్రయాణికులు.. చివరకు..
Advertisement

తాజా వార్తలు