తెదేపా బీసీ విభాగం ఆధ్వర్యంలో కృష్ణ నది పవిత్ర సంగమం వద్ద జల దీక్ష కార్యక్రమం..

మబ్బుల వీడిన చంద్రుడిలా నువ్వు మళ్ళీ మెరుస్తావ్ బాబు – మాజీ మంత్రి కొల్లు రవీంద్ర( Kollu Ravindra ) నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ తెదేపా బీసీ విభాగం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం కృష్ణ నది పవిత్ర సంగమం వద్ద జల దీక్ష కార్యక్రమం.మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా నది( Krishna River ) పవిత్ర సంఘంలో తెదేపా బీసీ విభాగం ఆధ్వర్యంలో నదిలో నిరసన తెలియజేస్తూ జల దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ విభాగం , జల దీక్షలో పాల్గొని మద్దతు తెలియజేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బీసీ విభాగం నాయకులు.

 Jal Diksha Program At The Holy Confluence Of Krishna River Under The Auspices O-TeluguStop.com

కొల్లు రవీంద్ర కామెంట్స్……చరిత్రలో మహోన్నత వ్యక్తులలో ఒకరైన నారా చంద్రబాబు నాయుడునీ అక్రమ అరెస్టు చేసి జైలులో నిర్బంధించడం ప్రజాస్వామ్య వ్యతిరేకం.ఈ ముఖ్యమంత్రి వలన కృష్ణ,గోదావరి నదిలుతో మనకున్న హక్కును కోల్పోవాల్సిన పరిస్థితి.

ఈ రోజు గోదావరి కృష్ణా జలాలు ముఖ్యమంత్రి పరిపాలన వలన వెలగలాడుతున్నాయి.తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు స్వచ్ఛమైన సాగునీరు అందించే పట్టిసీమ ప్రాజెక్టుకు ఆయువు పోశారు.

గతంలో ఏ పట్టిసీమ ప్రాజెక్టుపై వెటకారంగా మాట్లాడిన ముఖ్యమంత్రికి ఈ రోజు అదే పట్టిసీమ ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి పట్టుకొమ్మగా నిలిచింది.

మొదట్లో చంద్రబాబు( Chandrababu naidu ) 3000 కోట్లు అక్రమం చేశారని తరువాత 371 కోట్లని, ఇప్పుడు 27 కోట్లని మాట్లాడుతున్నారు.

ఇప్పుడు ఆ 27 కోట్ల రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీకి బాండ్ల రూపంలో విరాళాలు అందాయి.పార్టీకి విరాళాల అందిన సొమ్మును కూడా ఆక్రమం అంటే ఎట్లా.

రాబోయే రోజుల్లో ఈ ముఖ్యమంత్రి కి బీసీలు సత్తా ఏంటో చూపిస్తాం గద్ద దింపే వరకు విశ్రమించం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube